ETV Bharat / entertainment

అదిరిన కంగనా 'ధాకడ్​' ట్రైలర్​.. 'జయమ్మ' కోసం స్టార్​హీరోలు - నాగచైతన్య

Movie Updates: మిమ్మల్ని పలకరించడానికి మరోసారి సినీ అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో కంగనా రనౌత్​ 'ధాకడ్'​, యాంకర్​ సుమ 'జయమ్మ పంచాయితీ', నాగచైతన్య వెబ్​ సిరీస్​ సంగతులు ఉన్నాయి.

movie updates
movie updates
author img

By

Published : Apr 29, 2022, 7:54 PM IST

Kangana Dhaakad Trailer Released: 'శరీరం నుంచి ఆత్మను వేరు చేయటమే నా బిజినెస్‌' అంటూ యాక్షన్‌తో ఏజెంట్‌ అగ్నిగా అదరగొడుతోంది బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం 'ధాకడ్‌'. రజ్నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బార్‌ డ్యాన్సర్‌గా, సెక్స్‌వర్కర్‌గా, హోస్ట్‌గా.. ఇలా విభిన్న పాత్రల్లో కంగన దర్శనమిచ్చింది. చెడును అంతమొందించే మృత్యు దేవత భైరవికి తన పాత్ర ఏమాత్రం తీసిపోదంటూ ఏజెంట్‌ అగ్ని పాత్ర గురించి కంగనా చెప్పిన సంగతి తెలిసిందే. అర్జున్ రాంపాల్‌ రుద్రవీర్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jayamma Pachayati PreRelease Event: బుల్లితెర యాంకర్​ సుమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. చాలా కాలం క్రితమే హీరోయిన్​గా ఓ సినిమాలో నటించిన సుమ, ఆ తరువాత వాటికి జోలికి వెళ్లలేదు. మళ్లీ ఇప్పుడు.. సినిమాల వైపు మొగ్గు చూపించింది. ఆమె టైటిల్ రోల్ పోషించిన 'జయమ్మ పంచాయితీ' సినిమా మే 6న విడుదల కానుంది.

movie updates
జయమ్మ పంచాయితీ

ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముహూర్తాన్ని ఖరారు చేశారు మేకర్స్​. హైదరాబాద్​లో శనివారం సాయంత్రం ఈ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరోలు నాగార్జున, నాని హాజరుకానున్నారు. ఇదివరకే రిలీజైన ఈ సినిమా పాటలు, ట్రైలర్​కు మంచి రెస్పాన్స్​ వచ్చింది.

Naga Chaitanya Webseries First Look: నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వెబ్‌సిరీస్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది. నాగ‌చైత‌న్య ఈ సిరీస్​తోనే డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆయ‌న పాత్ర ఏ విధంగా ఉండ‌నుంది? లుక్ ఎలా ఉంటుందోన‌ని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

movie updates
నాగచైతన్య 'దూత' ఫస్ట్​ లుక్​

గురువారం జ‌రిగిన అమెజాన్ ప్రైమ్‌ ఈవెంట్‌లో ఈ సిరీస్ టైటిల్‌తో పాటు నాగ‌చైత‌న్య లుక్‌ను విడుద‌ల‌చేశారు. ఈ సిరీస్‌కు 'దూత' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో పాత‌కాలం నాటి క‌ళ్ల‌ద్దాలు ధ‌రించి సీరియ‌స్ లుక్‌లో నాగ‌చైత‌న్య క‌నిపిస్తున్నారు. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్​గా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోంది. ఇందులో చైత‌న్య ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అతీంద్రియ శ‌క్తుల‌తో అమాయ‌కుల జీవితాల్ని నాశ‌నం చేసే వారిని ఎదుర్కొనే యువ‌కుడిగా ప‌వ‌ర్‌ఫుల్​గా అత‌డి పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. మరోవైపు చైతూ.. పరుశురామ్​ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

movie updates
సూపర్​ గర్ల్​ 'ఇంద్రాణి' మూవీ కొత్త పోస్టర్​

ఇదీ చదవండి: మ‌హేశ్​తో క‌లిసి మ‌రో సినిమా చేయనున్న స్టార్ డైరెక్ట‌ర్‌?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.