ETV Bharat / entertainment

'రోలెక్స్​ సార్​'కు కమల్​ అదిరిపోయే గిఫ్ట్​.. పేరుకు తగ్గట్టే.. - సినిమా వార్తలు

'విక్రమ్'​ సక్సెస్​ నేపథ్యంలో మూవీటీమ్​కు గిఫ్ట్స్​ను ఇస్తున్న కమల్​హాసన్​.. తాజాగా సూర్యకు ఓ ఖరీదైన కానుక ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సూర్య సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. ఇంతకీ కమల్​ ఏం గిఫ్ట్​ ఇచ్చారో తెలుసా?

kamal haasan
కమల్
author img

By

Published : Jun 8, 2022, 4:28 PM IST

యూనివర్సల్​ స్టార్​ కమల్​ హాసన్​ హీరోగా నటించిన 'విక్రమ్​' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. దర్శకత్వం, నటన, నేపథ్యసంగీతం​ ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్​తో సంబరాలు చేసుకుంటున్న మూవీటీమ్​కు గిఫ్ట్​లు ఇచ్చి వారి ఖుషీని మరింత పెంచారు కమల్. ఇటీవల దర్శకుడు లోకేశ్​ కనకరాజ్​కు విలావంతమైన లెక్సెస్​ కారును, అసిస్టెంట్​ డైరెక్టర్లకు టీవీఎస్​ అపాచీ బైక్​లను ఇచ్చారు. తాజాగా ఈ సినిమాలో ఆఖర్లో కనిపించి తన నటనతో అదరగొట్టేసినా 'రోలెక్స్​'.. అదేనండి సూర్యకు కూడా సూపర్​ గిఫ్ట్​ ఇచ్చారు.

'రోలెక్స్​ సార్'​కు రోలెక్స్​!..: 'రోలెక్స్​ కాదు.. రోలెక్స్​ సార్​ అని పిలవండి' అంటూ క్లైమాక్స్​లో తన నటనతో అదరగొట్టేసిన సూర్యకు ఆ పాత్రపేరుకు తగినట్టు ఖరీదైన రోలెక్స్​ వాచ్​ను కానుకగా ఇచ్చారు. కమల్​.. తనకు రోలెక్స్​ను ఇస్తున్న ఫొటోను షేర్​ చేశారు సూర్య. ఇలాంటి క్షణాలు జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయని పేర్కొన్నారు. వాచ్​ బహుకరించినందుకు కమల్​కు థ్యాంక్స్​ చెప్పారు సూర్య.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్​ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీసు కలెక్షన్లు రూ.200 కోట్లు దాటాయి. త్వరలోనే ఈ చిత్రం 500 మార్క్​ను అందుకుంటదని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

ఇదీ చూడండి : రాజమౌళి-మహేశ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.