ETV Bharat / entertainment

'బింబిసార' తొలిరోజు కలెక్షన్స్​ ఎంతంటే? - బింబిసార రివ్యూ

Kalyanram Bimbisara collections: సూపర్​హిట్​ టాక్​తో దూసుకుపోతున్న నందమూరి హీరో కల్యాణ్​రామ్​ నటించిన 'బింబిసార' సినిమా తొలి రోజు మంచి వసూళ్లను సాధించింది. ఎంతంటే?

Kalyanram Bimbisara collections
కల్యాణ్ రామ్ బింబిసార కలెక్షన్స్
author img

By

Published : Aug 6, 2022, 12:06 PM IST

Kalyanram Bimbisara collections: జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త క‌థ‌ల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్య‌భ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు నందమూరి హీరో క‌ల్యాణ్ రామ్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడాయ‌న‌ 'బింబిసార'గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. కొత్త ద‌ర్శ‌కుడు వశిష్ఠ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే సోషియో ఫాంట‌సీ సినిమా కావ‌డం విశేషం.శుక్రవారం విడుదలైన ఈ భారీ ప్రాజెక్ట్​ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి.

బింబిసారాను రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే తొలిరోజే దాదాపు 50శాతంకు పైగా కలెక్షన్లను అందుకుంది. 6.3కోట్ల షేర్​ను వసూలు చేసింది.

  • నైజాం-2.15 కోట్ల రూపాయలు.
  • సి డెడ్-1.29 కోట్ల రూపాయలు.
  • ఉత్తరాంధ్ర-90 లక్షలు.
  • ఈస్ట్ గోదావరి-43 లక్షలు.
  • వెస్ట్ గోదావరి-36 లక్షలు.
  • గుంటూరు-57 లక్షలు.
  • కృష్ణ-34 లక్షలు.
  • నెల్లూరు-26 లక్షలు.

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.6.30 కోట్ల రూపాయల షేర్​తో పాటు రూ.9.30 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. కీలకమైన పాత్రలలో ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్​ కనిపించారు.

ఇదీ చూడండి: 'బింబిసార' - 'సీతారామం' ప్రీమియర్​ కలెక్షన్స్​ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.