'బేఖుదీ'తో నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలందరితో నటించిన ఆనాటి నటి కాజోల్. ఈ ఏడాదితో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరగడంపై ఆమె స్పందించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వల్ల ఎంతోమంది తారలు మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారని అన్నారు.
''నటీనటులందరికీ ఇది ఉత్తమకాలం. ఎందుకంటే, తమలోని టాలెంట్‌ని బయటపెట్టుకోవడానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయి. ఓటీటీ వల్ల ఎంతోమంది అద్భుతమైన తారలు వెలుగులోకి వస్తున్నారు. ఒకప్పటి తారలు సైతం మళ్లీ కెమెరా ఎదుటకు వచ్చి తమలోని సామర్థ్యాన్ని నిరూపించుకొంటున్నారు. ఒకప్పుడు నటిగా రాణించాలంటే ఇలాంటి శరీరకొలతలే ఉండాలని ప్రామాణికంగా చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు అటువంటి కొలతలు లేనప్పటికీ మంచి నటీమణులుగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని అందరి మన్ననలు పొందుతున్నారు.'' అని కాజోల్ వివరించారు.
2021లో విడుదలైన 'త్రిభంగా' తర్వాత కాజోల్ కెమెరా ముందుకు రాలేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక, ప్రస్తుతం ఆమె 'సలాం వెంకీ' సినిమా కోసం వర్క్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: National Nude Day: బాలీవుడ్ భామల 'న్యూడ్' షో.. ఆ సీన్స్‌తో మతి పోగొట్టారుగా..