Kajal Aggarwal Son Name: అందాల నటి, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ, ఆమె సోదరి నిషా అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరును ప్రకటించారు.
తమకు పుట్టిన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్లు కాజల్ భర్త గౌతమ్ తెలిపారు. ఇక, దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయ్యారనే వార్తను భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా కనిపించారు. ఇటీవల కాజల్ బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్!
రణ్‌బీర్-ఆలియాకు గిఫ్ట్‌గా రూ.26కోట్ల ఫ్లాట్.. ఎవరిచ్చారంటే?