ETV Bharat / entertainment

విలన్లను రప్ఫాడిస్తున్న కాజల్​ - మరీ ఇంత వైలెంట్​ అయితే ఎలా! - సత్యభామ మూవీ లేటెస్ట్ అప్​డేట్

Kajal Aggarwal Satyabhama Movie : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ కాజల్​ తాజాగా 'సత్యభామ' అనే సినిమాలో మెరిసింది. యాక్షన్​ అండ్​ సస్పెన్స్​ థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు. దాన్ని మీరూ ఓ లుక్కేయండి..

Kajal Aggarwal Satyabhama Movie
Kajal Aggarwal Satyabhama Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 1:20 PM IST

Kajal Aggarwal Satyabhama Movie : 'భగవంత్​ కేసరి' సక్సెస్​ను ఆస్వాదిస్తున్న టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కాజల్‌ అగర్వాల్‌.. ఇప్పుడు పోలీస్​గా మారిపోయింది. 'సత్యభామ' అనే హీరోయిన్​ ఓరియెంటడ్​ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మూవీ మేకర్స్​ ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ను విడుదల చేశారు. ఫుల్​ ఆన్​ యాక్షన్​ మోడ్​లో ఉన్న ఆ వీడియో ప్రేక్షకులను తెగ ఆక్టటుకుంటోంది. ఓ అమ్మాయి మర్డర్​ కేసును ఛేదించే క్రమంలో సత్యభామ(కాజల్​) ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనే ఆసక్తికర కోణంలో ఈ సినిమా సిద్ధమైనట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది.

యక్షన్​ మోడ్​లో కాజల్​.. విలన్లను చితక్కొడుతూ..
హత్యకు గురైన ఓ అమ్మాయి ప్రాణాలు కాపాడాలని సత్యభామ ట్రై చేస్తుంది. కానీ, ఆ అమ్మాయి కన్నుమూస్తుంది. దీంతో ఆ కేసును సత్యభామ నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. 'ఈ కేసు నీ చేతుల్లో లేదు' అని పోలీస్ ఆఫీసర్​ ప్రకాశ్​ రాజ్ చెబుతారు. అయితే తన చేతుల్లో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిందని, అప్పటి నుంచి ఆ గిల్ట్ ఫీలింగ్‌తో సత్యభామ బాధ పడుతుంటుంది. ఈ క్రమంలో ఆ యువతి ప్రాణాలు తీసిన హంతకులు కోసం వేట మొదలు పెడుతుంది. తన దారికి అడ్డు వచ్చిన విలన్లను చితక్కొడుతుంది. అలా ఈ టీజర్ ఆద్యంతం చాలా పవర్​ఫుల్​గా సాగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Satyabhama Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్​గా రానున్న ఈ చిత్రాన్ని సుమన్‌ చిక్కాల రూపొందిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.

Kajal Upcoming Movies : మరోవైపు 'భగవంత్​ కేసరి' తర్వాత కాజల్ ప్రస్తుతం 'సత్యభామ'తో పాటు కమల్​ హాసన్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'ఇండియన్‌ 2'లోనూ నటిస్తోంది. బాలీవుడ్​లోనూ ఓ సినిమాను చేస్తోంది. ఈ సినిమాలన్నీ ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Bhagvant Kesari Kajal Agarwal : బాలయ్యపై కాజల్​ అగర్వాల్​ కామెంట్స్​.. అలాంటివి లెక్కచేయదట​!

శారీలో మెరుస్తున్న జాన్వీ, కాజల్.. హీటెక్కించే ఫోజులతో మతిపోగొడుతున్న ఈషా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.