ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ విశేషాదరణ పొందిన గొప్ప నాయకులని కొనియాడారు. వర్సిటీ పేరు మార్పుతో ఎన్టీఆర్ కీర్తిని చెరిపివేయలేరని స్పష్టం చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ పేరును చెరిపివేయలేరని ట్విటర్ వేదికగా తెలిపారు. ఒకరిపేరు తొలగించడం వల్ల వారి గౌరవం తగ్గదని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేరు మార్పుతో ఎన్టీఆర్ స్థాయి తగ్గదు.. వైఎస్‌ఆర్ స్థాయి పెరగదు.. అని ట్వీట్ చేశారు.
ఇక ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పేరు మార్పుపై తెదేపా, ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు.
నిన్న నందమూరి రామకృష్ణ సైతం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. జగన్ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.
ఇవీ చూడండి: