ETV Bharat / entertainment

Jr NTR Hindi Movie : ఎన్​టీఆర్​ బీటౌన్ ఎంట్రీలో ట్విస్ట్​.. 'వార్‌2' కంటే ముందే ఆ సినిమాలో..! - సల్మాన్ ఖాన్​ టైగర్​ 3 లో ఎన్​టీఆర్​

Jr NTR Hindi Movie : టాలీవుడ్​ యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్​టీఆర్​ త్వరలో బీటౌన్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. హృతిక్​ రోషన్​తో కలిసి 'వార్​2' సినిమాలో స్క్రీన్​ షేర్​ చేసుకోనున్నారు. అయితే అంతకంటే ముందు ఆయన మరో స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్​ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే ?

Jr NTR Hindi Movie
Jr NTR Hindi Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 12:40 PM IST

Jr NTR Hindi Movie : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ లీడ్​ రోల్​లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న లేటెస్ట్ మూవీ 'వార్‌2'. 2019లో విడుదలైన వార్​-1కు సీక్వెల్​గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో సెట్స్​పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్​టీఆర్​ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఎన్​టీఆర్ బాలీవుడ్​ డెబ్యూ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వార్​ 2 సినిమాకంటే ముందు ఆయన మరో సినిమాతో బీ టౌన్​లో ఎంట్రీ ఇవ్వనున్నారట. ఓ స్టార్‌ హీరో చిత్రంలో ఆయన గెస్ట్​ రోల్​లో కనిపించనున్నారట.

Jr NTR In Tiger 3 Movie : కండల వీరుడు సల్మాన్​ ఖాన్​, కత్రీనా కైఫ్​ జంటగా నటిస్తోన్న 'టైగర్‌ 3' సినిమాలోని క్లైమాక్స్‌ సీన్​లో జూనియర్​ ఎన్​టీఆర్​ కనిపించనున్నారట. 'వార్‌ 2'ను రూపొందిస్తున్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థ పైనే ఈ 'టైగర్‌ 3' సినిమా కూడా రూపొందుతోంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్​ ఈ కెమియో రోల్​ గురించి ఎన్​టీఆర్​తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అక్కడి మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై మూవీ టీమ్ ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ ఇది నిజమైతే.. ఈ సినిమా భారీ మల్టీ స్టారర్‌ అవుతుందని ఫ్యాన్స్​ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

War 2 Shooting Update : మరోవైపు 'వార్2' మూవీ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఎన్​టీఆర్​తో అయాన్‌ ముఖర్జీ చర్చలు కూడా జరిపారట. రానున్న నవంబర్‌లో ఈ సినిమా షూటింగ్​ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తారక్​ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ముగిస్తుంది. పోస్ట్​ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్ని వచ్చే ఏడాది ఏప్రిల్​లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

JR NTR Mokshagna : ఎన్​టీఆర్​​ను ఆప్యాయంగా హత్తుకున్న మోక్షజ్ఞ.. ఇప్పుడీ ఫొటోనే సోషల్​మీడియా సెన్సేషన్​..

SIIMA 2023 Awards : NTRకు బెస్ట్​ యాక్టర్​ అవార్డ్​.. ఫ్యాన్స్​కు యంగ్ టైగర్ పాదాభివందనం ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.