ETV Bharat / entertainment

'ఎన్టీఆర్‌ 31' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. ఎన్టీఆర్‌ లుక్​ అదుర్స్​ - ntr new movie

తారక్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఇద్దరి కాంబినేషన్​లో రాబోతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

NTR 31
ఎన్టీఆర్‌ 31
author img

By

Published : May 20, 2022, 1:54 PM IST

Updated : May 20, 2022, 2:00 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ఓసినిమా సిద్ధం కానున్న సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకు వచ్చింది. శుక్రవారం తారక్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ రిలీజ్‌ చేశారు. ''రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే, ఈ నేలే ఆయన వారసత్వం.. రక్తం కాదు'' అని ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నారు. ఇందులో తారక్‌.. ఇంటెన్స్‌ లుక్‌లో ఫుల్‌ యాంగ్రీగా కనిపించారు. ఎన్టీఆర్​31గా ఇది ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కియారా లేదా రష్మిక కథానాయికగా కనిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

NTR 31
ఎన్టీఆర్‌ 31 ఫస్ట్‌లుక్‌

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు తెలిపారు. స్థానిక మీడియాతో తాజాగా ముచ్చటించిన ప్రశాంత్‌నీల్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ''20 ఏళ్ల క్రితమే నాలో ఈ కథ ఆలోచన మెదిలింది. ఈ కథ స్థాయి, పరిమాణం భారీగా ఉండటంతో ఇంతకాలం వెనక్కి తగ్గాను. ఎట్టకేలకు నా కలల ప్రాజెక్ట్‌ని నా డ్రీమ్‌ హీరోతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది'' ప్రశాంత్‌నీల్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నవాజుద్దీన్​ సిద్దిఖీ : వాచ్​మన్​ టు బాలీవుడ్​ టాప్​ యాక్టర్​- 'కేన్స్' ఫెస్టివల్స్​లో 7బర్త్​డేలు

Last Updated : May 20, 2022, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.