ETV Bharat / entertainment

విశ్వక్​ను చూసి షాక్​ అయ్యా.. ఆ రోజే రియలైజ్​ అయ్యా: ఎన్టీఆర్​

author img

By

Published : Mar 17, 2023, 10:25 PM IST

యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'దాస్‌ కా దమ్కీ'. నివేదా పేతురాజ్‌ హీరోయిన్​. మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. దీనికి జూనియర్​ ఎన్టీఆర్​ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. సినిమా విజయం సాధించాలని ఆశించారు. ఇంకా తారక్​ ఏం అన్నారంటే?

NTR Daska Dhamki
విశ్వక్​ను చూసి షాక్​ అయ్యా.. ఆ రోజే రియలైజ్​ అయ్యా:

యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'దాస్‌ కా దమ్కీ'. నివేదా పేతురాజ్‌ హీరోయిన్​. మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. దీనికి జూనియర్​ ఎన్టీఆర్​ ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. సినిమా విజయం సాధించాలని ఆశించారు.

ఎన్టీఆర్​ మాట్లాడుతూ.. "ఆర్​ఆర్​ఆర్​ చిత్రం ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడిందంటే.. అలాగే ఆస్కార్​ సాధించడానికి... రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్​, ప్రేమ్​ రక్షిత్​ ఎంత కారణమో.. యావత్ తెలుగు చిత్రసీమ, భారత దేశ చిత్రసీమ కూడా అంతే కారణం. దీంతో పాటు యావత్​ దేశ ప్రేక్షకుల కారణం. అంతకంటే ముఖ్యంగా మీ అభిమానమే కారణం. మేము మాత్రమే కాదు మీరూ ఈ అవార్డు సాధించారు. మీ అందరి బదులు మేము అక్కడ నిలబడ్డాం. మా బదులు కీరవాణి, చంద్రబోస్​ నిలబడ్డారు. ఆస్కార్ స్టేజ్​ మొత్తం తెలుగుదనం ఉట్టిపడింది. ఇద్దరు తెలుగువాళ్లు అక్కడ కనిపించారు. నా రెండు కళ్లు చాలలేదు అది చూడాటానికి. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమాలు, భారత సినిమాలు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇక విశ్వక్​ సేన్​ విషయానికొస్తే.. అతడికి​ ఉన్న కాన్ఫిడెన్స్​ ఎవరికి ఉండదు. ఎనర్జీ బాల్​. నా కన్నా ఎక్కువగా మాట్లాడతాడు. నేను సైలెంట్​ అయి అతడి మాటలు వినే స్టేజ్​కి వెళ్లిపోయాను. నేను మూడాఫ్,​ టెన్షన్​లోకి వెళ్లిన కొన్ని చిత్రాలు చూస్తాను. అందులో ఈ నగరానికి ఏమైంది సినిమా ఉంటుంది. అందులో విశ్వక్​ నటన చాలా బాగుంటుంది. అద్భుతంగా నటించాడు. బాధను, కామెడీని రెండిటిని తన యాక్టింగ్​లో బాగా చూపించాడు. ఇక ఫలక్​నామా దాస్​ అయితే.. డైరెక్టర్​గా, యాక్టర్​గా చాలా కాన్ఫిడెంట్​గా కనిపించాడు. పాగల్​ చేసినప్పుడు అతడు ఓ చక్రంలోకి వెళ్లిపోతున్నాడని అనుకున్నా. కానీ ఇక అశోకవనంలో అర్జునకల్యాణం చిత్రం చూసినప్పుడు షాక్ అయ్యాడు. అంత యాటిట్యూడ్​, కాన్ఫిడెంట్​తో మాట్లాడే మనిషి.. అంత చేంజ్​ అవుతాడా అనిపించింది. నేను చేంజ్​ అవ్వడానికి చాలా సమయం పట్టింది. నేను ఒక చట్రంలోకి వెళ్లిపోతున్నాని అనిపించి.. ఆ తర్వాత నటుడిగా నేను ఆనందపడే చిత్రాలు చేయాలని చాలా లేట్​గా రియలైజ్​ అయ్యాను. అప్పుడే అన్నాను కాలర్​ దించుకోకుండా సినిమాలు చేస్తానని. ఆరోజే మళ్లీ నటుడిగా పుట్టాను. మీకు మాట ఇచ్చినరోజే పుట్టాను. ఇప్పుడు కాలర్​ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్నానని అనుకుంటున్నాను. కానీ విశ్వక్​ మాత్రం అంత త్వరగా పరిణితి చెందాడా అనిపించింది. నటుడిగా బ్యాలెన్స్​ చేయడం విశ్వక్​కు చాలా త్వరగా బాగా కుదిరింది. దాస్​ కా దమ్మీ నిజంగా బ్లాక్ బస్టర్​ అవ్వాలని కోరుకుంటున్నాను." అని ఎన్టీఆర్ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: క్యూటీ స్మైల్​లో అనుపమ.. డోంట్​ కేర్​ అంటున్న మృణాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.