Johnny Depp wins defamation case: మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై హై ప్రొఫైల్ పరువు నష్టం కేసులో గెలిచాడు హాలీవుడ్ అగ్రహీరో జానీ డెప్. ఈ మేరకు వర్జీనియా ఫెయిర్ఫాక్స్లోని జ్యూరీ బుధవారం అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వేధింపులకు గురైనట్లు హెర్డ్ కల్పిత ఆరోపణలు చేసిందన్న డెప్ వాదనను సమర్థించింది.
తనను తాను గృహహింస బాధితురాలిగా చిత్రీకరించుకుంటూ 2018లో 'ది వాషింగ్టన్ పోస్ట్' కోసం రాసిన వ్యాసం ఆధారంగా హెర్డ్‌పై రూ.389 కోట్ల (50 మి.డాలర్లు) పరువు నష్టం దావా వేశాడు డెప్. దీనిని సవాలు చేస్తూ తమ 15 నెలల వివాహబంధంలో తాను గృహహింసను ఎదుర్కొన్నట్లు హెర్డ్ రూ.776కోట్ల (100మి.డాలర్లు) పరువు నష్టం దావా వేసింది.
డెప్‌కు రూ.116 కోట్ల (15మి.డాలర్లు) పరిహారం చెల్లించాలని జ్యూరీ తీర్పుచెప్పింది. అయితే హెర్డ్ కూడా పాక్షికంగా తన పరువునష్టం కేసు గెలిచింది. హెర్డ్ చేసిన ఆరోపణలు కుట్రపూరితమని డెప్ తరఫు మాజీ న్యాయవాది వ్యాఖ్యానించారు. పరిహారం కింద ఆమెకు రూ.15.5కోట్లు (2 మి.డాలర్లు) చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.
ఇవీ చూడండి: హీరో భార్యతో ఎలాన్ మస్క్ రాసలీలలు.. విడాకుల కేసులో ట్విస్ట్!
'అన్నీ మర్చిపోయి ముందుకు సాగండి'.. మాజీ ప్రేయసిపై మస్క్ ట్వీట్