ETV Bharat / entertainment

రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్‌.. అన్ని కోట్లా? - జవాన్​ డిజిటల్​ రైట్స్​

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న షారుక్​ కొత్త చిత్రం 'జవాన్​'. ఫస్ట్​లుక్​తోనే క్రేజ్​ తెచ్చుకున్న ఈ మూవీ..​ తెరపైకి ఎక్కకుండానే ఎన్నో రూమర్స్​కు నెలవవుతోంది. తాజాగా ఈ మూవీ డిజిటల్​ రైట్స్​ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

shah-rukh-khan-jawan-satellite-and-ott-rights-sold-for-record-250-crores-as-per-report

author img

By

Published : Sep 25, 2022, 7:13 PM IST

Jawan Movie Digital Rights : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న నెట్​ఫ్లిక్స్​, జీ దాదాపు రూ.250 కోట్లు చెల్లించిన్నట్లు తెలుస్తోంది.

'జవాన్​'లో మరో స్టార్​ హీరో?
సెప్టెంబర్​ 21న తన పుట్టినరోజు సందర్భంగా మిత్రులు, కొంతమంది నటీనటుల సమక్షంలో పార్టీ చేసుకున్నారు దర్శకుడు అట్లీ. అయితే ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫొటోను అట్లీ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు స్టార్ల మధ్య అట్లీ ఉన్నారు. ఆ ఇద్దరు స్టార్లు మరెవరో కాదు. ఒకరు కింగ్​ ఖాన్​ షారుక్​, మరొకరు తమిళ స్టార్​ దళపతి విజయ్​.. ఈ ఫొటోను చూసిన అభిమానులు విజయ్ కచ్చితంగా 'జవాన్'​లో భాగమై ఉంటారని అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట్లో హల్​చల్ చేస్తోంది.

shah-rukh-khan-jawan-satellite-and-ott-rights-sold-for-record-250-crores-as-per-report
విజయ్​, అట్లీ, షారుక్​

ఐదు భాషల్లో రిలీజ్​ కానున్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైనమంట్స్​తో పాటు గౌరీ ఖాన్​ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్‌కు జంటగా నయనతార నటిస్తున్నారు. షారుక్​ మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్'. మరొకటి రాజ్ కుమార్ హిరానీ 'డుంకీ' మూవీ.

ఇవీ చదవండి: సితారకు మహేశ్​ స్పెషల్​ విషెస్​​.. తన ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుందంటూ

మొన్న గుర్రపు స్వారీ.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్​.. ఆ సినిమా కోసం కాజల్​ హార్డ్​ వర్క్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.