Jawan Day 7 Box Office Collection : 'పఠాన్' తర్వాత అంతటి రేంజ్లో సక్సెస్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది 'జవాన్' మూవీ. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా.. విడుదలైన ఆరు రోజుల్లోనే సుమారు రూ. 570 కోట్లకు పైగా అందుకుని చరిత్రకెక్కింది. వీకెండ్స్‌తో పాటు వీక్ డేస్‌లోనూ మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఏడో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.30 కోట్లు నెట్, రూ. 44 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసిందట. ఈ క్రమంలో అతి కొద్ది సమయంలోనే రూ. 650 కోట్లు మార్క్ దాటింది. అంతే కాకుండా ఇలా వారంలోనే 600 కోట్లు మార్క్ దాటిన మొదటి హిందీ సినిమాగా 'జవాన్' ఓ అరుదైన రికార్డును తన ఖాతాలోకి వేసుకుంది.
Jawan Cast : భారీ అంచనాలు నడుమ విడుదలైన 'జవాన్' సినిమా.. అనుకున్నట్లుగానే ఆ అంచనాలకు తగ్గట్లుగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా 'జవాన్' మేనియా నడుస్తోంది. ఇందులో షారుక్ విభిన్న లుక్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. దీంతో ఆయన లుక్స్‌తో పాటు సినిమాలోని యాక్షన్ సీన్స్ అదిరిపోయాయంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సీనియర్ నటి ప్రియమణి , బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించి ఆడియెన్స్‌ను మెప్పించారు. దీపికా పదుకొణె, సంజయ్ దత్ లాంటి తారలు ఇందులో అతిథి పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ సతీమణి గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.
Sharukh Khan Jawan Movie Collection : మరోవైపు షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా రికార్డులను ఈ 'జవాన్' అధిగమిస్తోంది. పఠాన్ సినిమా తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. 'జవాన్' మాత్రం రూ. 75 కోట్లు వసూలు చేసి టాప్కు చేరుకుంది. అలా ఒకే ఏడాదిలో తాను నటించిన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక ఇండియన్ స్టార్‌గా షారుక్ చరిత్రకెక్కారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Jawan Special Screening : తారల కోసం 'జవాన్' స్పెషల్ స్క్రీనింగ్.. కత్రినా, దీపిక, సుహానా సందడి