ETV Bharat / entertainment

Jawan Day 5 Box Office Collection : ఆగని 'జవాన్​' జోరు.. ఇండియాలోనే మూడో సినిమాగా రికార్డు.. - జవాన్ మూవీ ఇండియా కలెక్షన్స్

Jawan Day 5 Box Office Collection : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ నటించిన జవాన్ సినిమా తొలి రోజు నుంచే బాక్సఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా 5వ రోజు ఎంత వసూలు చేసిందంటే..

Jawan Day 5 Box Office Collection
Jawan Day 5 Box Office Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 11:21 AM IST

Updated : Sep 12, 2023, 2:19 PM IST

Jawan Day 5 Box Office Collection : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​- అట్లీ కాంబినేషన్​లో తెరకెక్కిన 'జవాన్' మూవీ.. రిలీజైన రోజు నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుని బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు రూ. 75 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. క్రమ క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. ఇక ఐదో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.30 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్​ వర్గాల సమచాారం.

ఇక ఓవర్సీస్ లో రూ.177 కోట్ల వసూళ్లతో... రూ.316 కోట్ల నెట్ అందుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.520 కోట్లు రాబట్టినట్లు ట్రెడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో 2023లో భారతదేశంలో రూ. 300 కోట్ల మార్కును దాటిన మూడవ బాలీవుడ్ చిత్రంగా 'జవాన్' చరిత్రకెక్కింది.

Sharukh Khan Jawan Movie Collection : 'పఠాన్​' తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. 'జవాన్'​ మాత్రం రూ. 75 కోట్లు వసూలు చేసి టాప్​కు చేరుకుంది. ఈ క్రమంలో షారుక్​ మరో రికార్డును అందుకున్నారు. ఒకే ఏడాదిలో రిలీజైన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక ఇండియన్​ స్టార్​గా చరిత్రకెక్కాడు. ఆయన నటించిన రెండు సినిమాలు ఇలా ఒకదానికి మించి ఒకటి రికార్డు స్థాయిలో వసూలు సాధించడం పట్ల షారుక్ ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట 'జవాన్' సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.

Jawan Cast : ముందు నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చిన 'జవాన్'కు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుక్​ లుక్​ కొత్తగా ఉందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయంటూ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్​కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. సీనియర్ నటి ప్రియమణి , సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు దీపికా పదుకొణె, స్టార్​ హీరో సంజయ్‌ దత్‌ గెస్ట్​ రోల్స్​లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan Worldwide Collection Day 1 : 'జవాన్' సునామీలోనూ 'ఆదిపురుష్' టాప్.. ప్రభాస్ స్టార్​డమ్​ అంటే అట్లుంటది!

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే!

Last Updated : Sep 12, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.