ETV Bharat / entertainment

షారుక్​పై భారీ యాక్షన్​ సీక్వెన్స్ ప్లాన్​​.. 250మంది మహిళలతో కలిసి - 250 మంది మహిళలతో షారుక్​ యాక్షన్​ సీక్వెన్స్

బాలీవుడ్​ కింగ్​ ఖాన్​ షారుక్​ ఖాన్​-అట్లీ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్​ బయటకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ హై యాక్షన్​ వోల్టేజ్​ సీక్వెన్స్​ను చిత్రీకరించనున్నారట. ఇందులో దాదాపు 250 మంది మహిళలు పాల్గొంటారని తెలిసింది.

.
.
author img

By

Published : Sep 14, 2022, 11:15 AM IST

Updated : Sep 14, 2022, 11:41 AM IST

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌-తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. దక్షిణాది నటి నయనతార ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి మరో విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్​ను చెన్నైలో చిత్రీకరించబోతున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అయితే ఇందులో దాదాపు 200-250 మంది మహిళలు పాల్గొంటారని తెలిసింది. వీరిందరిని ముంబయిని నుంచి తీసుకురానున్నారట. మొత్తం ఏడు రోజుల పాటు ఈ హై యాక్షన్ సీక్వెన్స్​ షూటింగ్​ జరగనుందని టాక్​. మరి ఈ హై వోల్టేజ్​ సీన్​లో వారితో కలిసి షారుక్​ ఎలాంటి సాహసం చేయబోతున్నారా అనే ఆసక్తి ప్రస్తుతం అభిమానుల్లో మెదులుతోంది. దీంతోపాటే రాబోయే మూడు వారాల పాటు షారుక్​పై కీలక సన్నివేశాలను షూట్​ చేయబోతున్నారట.

"ఇక ఈ సినిమా గురించి షారుక్ మాట్లాడుతూ.. "జవాన్​ యూనివర్సల్​ స్టోరీ. ఇలాంటి యూనిక్​ ఫిల్మ్​ను రూపొందిస్తున్నందుకు క్రెడిట్​ అంతా అట్లీకే దక్కుతుంది. అతడితో కలిసి పనిచేయడం ఓ అద్భుతమైన గొప్ప అనుభూతి. నేను లవ్​ యాక్షన్​ ఫిల్మ్స్​ బాగా ఇష్టపడతాను. ఇటీవలే వచ్చిన టీజర్​ సాంపుల్ మాత్రమే" అని షారుక్ అన్నారు.

ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్​ హీరో 'తలపతి' విజయ్​ ఓ కామియో రోల్‌ చేయనున్నట్లు సమాచారం. గతంలో అట్లీ దర్శకత్వంలో 'థెరీ', 'బిగిల్‌', 'మెర్సెల్‌'.. చిత్రాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అప్పట్లో 'బిగిల్‌' చిత్రంలో షారుక్‌ నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. అది నిజం కాలేదు. ఈసారైనా వీరి జోడి వస్తుందన్న లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో నటులు రానా, సాన్య మల్హోత్రా, సునీల్‌ గోవర్‌, సైతం కీలక పాత్ర పోషించనున్నారట. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు.. ఏఆర్‌ రెహమాన్‌, అనిరుధ్‌ రవిచందర్‌ పనిచేస్తున్నారని వినిపించగా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

ఇదీ చూడండి: పవన్ కల్యాణ్ హిట్​ మూవీని సల్మాన్​ ఖాన్​ రీమేక్ చేస్తున్నారా?

Last Updated : Sep 14, 2022, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.