ETV Bharat / entertainment

Jawan Atlee Film : 'అదే నా సక్సెస్ ఫార్ములా'.. జవాన్ బడ్జెట్​ చెప్పిన అట్లీ.. వామ్మో ఎన్ని వందల కోట్లో - జవాన్ కలెక్షన్స్

Jawan Atlee Film : జవాన్​తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అట్లీ తన సక్సెస్​ సీక్రెట్​ను తెలిపారు. అలాగే జవాన్ చిత్ర బడ్జెట్​ కూడా చెప్పారు. ఆ సంగతులు..

Jawan Atlee Film : 'అదే నా సక్సెస్ ఫార్ములా'.. జవాన్ బడ్జెట్​ వివరాలు చెప్పేసిన అట్లీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 12:35 PM IST

Jawan Atlee Film : రీసెంట్​గా రిలీజైన షారుక్ జవాన్​.. బాక్సాఫీస్ ముందు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ మూవీటీమ్​.. సక్సెస్​ మీట్​ను నిర్వహించింది. ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ.. తనకు కింగ్ ఖాన్ షారుక్‌ అంటే ఎంత ఇష్టమో చెప్పారు. అలాగే తనపై నమ్మకంతో షారుక్‌ సినిమా బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని పేర్కొన్నారు. అలాగే తన సినిమాలు వరుస విజయాలను అందుకోవడం గురించి కూడా చెప్పారు.

Atlee Shahrukh Jawan Budget : "కరోనా సమయంలో షారుక్‌ ఖాన్​కు జవాన్‌ కథ చెప్పాను. ఆ సమయంలో అసలు కొన్నేళ్ల పాటు థియేటర్లకు ఆడియెన్స్​ వస్తారా అనిపించింది. అలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్మి రూ.40 కోట్ల బడ్జెట్‌ పెట్టేందుకు ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారా అని సందేహపడ్డాను. ఎందుకంటే ఒక నిర్మాతగా నాకు ఆ ఆలోచనలు బాగా తెలుసు. కానీ, అలాంటి సమయంలో షారుక్‌ నాపై ఎంతో నమ్మకంతో ఉంచారు. రూ.300 కోట్లు పెట్టేందుకు ఒకే అన్నారు. సినిమా పూర్తయే సరికి ఆ బడ్జెట్‌ మరింత పెరిగిపోయింది. అయినా ఆయన మాత్రం ఎక్కడా అస్సలు రాజీపడలేదు. ప్రేక్షకులు మాకు ఓ భారీ బ్లాక్‌బస్టర్‌ స్టేటస్​ను అందించారు. ఈ సినిమా నేను షారుక్‌కు రాసిన ప్రేమలేఖగా భావిస్తాను" అని పేర్కొన్నారు.

Atlee Success Secret : అలానే తన సినిమాలు వరుసగా విజయాలు సాధించడం గురించి కూడా మాట్లాడారు అట్లీ. "నేను ఓ రచయితలా, దర్శకుడిగా సినిమా తెరకెక్కించను. ఓ అభిమానిగా సినిమా చేస్తాను. నేను ఓ వ్యక్తికి ఫ్యాన్ కాదు.. సినిమాకు అభిమానిని. ఒక చిత్రంలో ప్రతి విషయాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి నా దగ్గర ఫార్ములాలు అంటూ ఏమీ లేవు. ఏది బాగుంటుంది అని అనిపిస్తే అదే చేస్తాను. నా లైఫ్​లో నేర్చుకున్న విషయాలనే చిత్రంలో చూపిస్తాను. నా ఫ్యామిలీ, నా చుట్టూ ఉండే పరిస్థితుల ద్వారా నేను గమనించిన విషయాలను ఓ సినిమాగా తెరకెక్కిస్తాను. అదే నా సక్సెస్ సీక్రెట్​" అని అట్లీ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Shahrukh Khan Bald Look : 'జవాన్​'లో షారుక్​ అందుకే 'గుండు'తో కనిపించారట.. రెమ్యునరేషన్​గా దీపిక ఒక్క రూపాయి కూడా..

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.