ETV Bharat / entertainment

'అమ్మ మరణం తర్వాత అతడి రాక.. చాలా ధైర్యాన్నిచ్చింది' - బోనీ కపూర్​

Janhvi Kapoor: అమ్మ మరణం తర్వాత అన్నయ్య అర్జున్​ కపూర్​ తమ జీవితాల్లో రావడం వల్ల చాలా ధైర్యం వచ్చిందని తెలిపారు అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్​. వెండితెరపై సూపర్​ సక్సెస్ ​కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.

JAHNVI KAPOOR
JAHNVI KAPOOR
author img

By

Published : Apr 24, 2022, 3:29 PM IST

Janhvi Kapoor: బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌, అలనాటి తార శ్రీదేవిల పెద్దకుమార్తెగా బాలీవుడ్‌లో ఫేమ్‌ సొంతం చేసుకున్న హీరోయిన్​ జాన్వీకపూర్‌. 'ధడక్‌'తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్‌గా సూపర్‌ సక్సెస్‌ అందుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జాన్వీ ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

JAHNVI KAPOOR
జాన్వీ కపూర్​

"సోషల్‌మీడియాలో భిన్నమైన మనుషులు ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కోలా స్పందిస్తుంటారు. వాళ్లు పెట్టే కామెంట్లు చూసి కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటా" అని జాన్వీ తెలిపారు. అనంతరం, అర్జున్‌కపూర్‌, ఆయన సోదరి అన్షులా కపూర్‌.. తమ జీవితాల్లోకి ప్రవేశించడంపై జాన్వీ స్పందించారు. "అమ్మ మరణం తర్వాత అర్జున్‌ అన్నయ్య, అన్షులా మా జీవితాల్లోకి వచ్చారు. వాళ్ల రాకతో మేం మరింత ధైర్యవంతులమయ్యామనే భావన కలిగింది. ఖుషీకి నాకూ మరో ఇద్దరు తోబుట్టువులు దొరికారు. ఇందుకు మేము ఎంతో అదృష్టవంతులం. మేము నలుగురం కలిసి ఉన్నందుకు నాన్న కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఆయన మాతో ఒక ఫ్రెండ్‌లానే ఉంటారు" అని జాన్వీ వివరించారు.

JAHNVI KAPOOR
అర్జున్​ కపూర్​తో జాన్వీ

ఇవీ చదవండి: చిరు, ఉపాసన.. వీరిద్దరిలో చరణ్‌ ఎవరికి భయపడతారంటే?

యశ్​ కన్నా రాకీభాయ్​ తల్లి వయసు అంత తక్కువా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.