ETV Bharat / entertainment

'15ఏళ్లకే మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు చూశా!- ఆ విషయంలో రష్మిక గ్రేట్' - జాన్వీ కపూర్ న్యూస్

Janhvi Kapoor Deep Fake : శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే 15 ఏళ్ల వయసులోనే తన మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు చూశానని పేర్కొంది. అసలేం జరిగిందంటే?

Janhvi Kapoor Deep Fake
Janhvi Kapoor Deep Fake
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 10:20 PM IST

Janhvi Kapoor Deep Fake : ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న హీరోయిన్లలో జాన్వీ కపూర్‌ ఒకరు. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నిస్తోంది. ఇటీవల కాలంలో అందరినీ భయపెడుతున్న అంశం 'డీప్‌ ఫేక్‌'. రష్మిక ఫేక్‌ వీడియో వైరల్‌ అయిన తర్వాత దీని గురించి చాలా మందికి తెలిసింది. అయితే, 15 ఏళ్ల వయసులోనే తనకు సంబంధించిన మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను చూశానని జాన్వీ కపూర్‌ తెలిపింది. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల గురించి ఈ అమ్మడు ఏమందంటే?

డీప్‌ ఫేక్‌ వీడియో బయటకు వచ్చిన వేళ హీరోయిన్​ రష్మిక మందన్న ధైర్యంగా తన గళాన్ని వినిపించారని జాన్వీ కపూర్​ ప్రశంసించింది. 'ఇలా చెప్పడం వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఏది చెప్పినా, ఏం మాట్లాడినా ప్రతి ఒక్కరూ నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలాల గురించి మాట్లాడతారు. అందుకే నేనెప్పుడూ అప్రమత్తంగానే ఉండేదాన్ని. నాకేం కావాలో, ఏం వద్దో ఎప్పుడూ బహిరంగంగా నా అభిప్రాయాలను వెల్లడించలేదు. డీప్‌ ఫేకర్స్‌, ఫొటోలను మార్ఫింగ్‌ చేసేవారి గురించి మాట్లాడానికి కూడా నాకు హక్కులేదు. ఈ విషయంలో నేనేమీ చెప్పలేను. కానీ, అలాంటి వారిని ఎదిరిస్తూ రష్మిక నిలబడిన తీరును మాత్రం ప్రశంసిస్తా. యుక్తవయసులోనే నా మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను చూశా. ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదేమో అనుకున్నా. ఎందుకంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి నేను అలా చేస్తున్నానని అనుకుంటారేమోనని భయపడ్డా' అని జాన్వీ కపూర్‌ తెలిపింది.

జాన్వీ కపూర్‌ 2018లో ధడక్‌ సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టింది. మూవీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లకు తెలుగులో ఓ సినిమాకు సంతకం చేసింది. ప్రస్తుతం జాన్వీ కపూర్​ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. జూనియర్​ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడు. అటు జాన్వి సోదరి ఖుషీ కపూర్‌ ఈ మధ్యే ద ఆర్చీస్‌ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.