Avatar Director James cameron: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్.. ఈ పేరు తెలియని సినీ అభిమానులుండరు. 'ద టెర్మినేటర్', 'ఎలియన్స్', 'ద ఎబిస్', 'ట్రూలైస్', 'టైటానిక్', 'అవతార్' చిత్రాల ద్వారా అద్భుత లోకాలలో ప్రేక్షకులను విహరింపజేసిన సృజనశీలి. ప్రస్తుతం ఆయన.. పండోరా అనే కొత్త లోకాన్ని పరిచయం చేసిన చిత్రం 'అవతార్'కు కొనసాగింపుగా సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఆయన అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. అవతార్ మూడో భాగం తర్వాత తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌ను తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
"నేను మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. దానిపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను. అవతార్ దర్శకత్వ బాధ్యతలను నమ్మకమైన, సామర్థ్యమైన మరో దర్శకుడికి అప్పజెప్పాలనుకుంటున్నాను." అని జేమ్స్ కామెరూన్ తెలిపారు. 'అవతార్' సీక్వెల్ అద్భుతంగా ఉంటుందని, మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యకం చేశారు కామెరూన్. అయితే ఇది సినిమా మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ ఫ్రాంచేజీలో నాలుగు లేదా ఐదు భాగాలు తెరకెక్కుతాయని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Na peru Seesa: లవ్ ఫెయిల్యూర్.. క్యాన్సర్.. 700కుపైగా ఆడిషన్స్.. కానీ ఆ ఒక్క ఛాన్స్!