ETV Bharat / entertainment

జ్ణానవేల్ కొత్త సినిమా 'దోశ కింగ్'.. ​హృద్యంగా 'సీతా రామం' ట్రైలర్​ - deepika new movie

రష్మిక, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'సీతా రామం' ట్రైలర్​లోని సంభాషణలు హృద్యంగా ఉన్నాయి. 'జై భీమ్' దర్శకుడు జ్ణానవేల్ తన కొత్త సినిమా పేరును ప్రకటించారు.

'Jai Bhim' director TJ Gnanavel to helm drama-thriller Dosa King.. sita ram trailer out
జ్ణానవేల్ కొత్త సినిమా 'దోశ కింగ్'.. ​హృద్యంగా 'సీతా రామం' ట్రైలర్​
author img

By

Published : Jul 25, 2022, 2:59 PM IST

Updated : Jul 25, 2022, 3:13 PM IST

రష్మిక, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సీతా రామం'. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. '20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్‌ రామ్‌ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి' అని సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం హృదయాన్ని హత్తుకునేలా సాగింది. రామ్‌ రాసిన లేఖను సీతామహాలక్ష్మికి చేర్చడానికి ఎంతగానో శ్రమించిన రష్మిక.. 'సీతను ఎలా పట్టుకోవాలి. నాకింకా పది రోజులే సమయం ఉంది. రామ్‌ గురించి తెలిస్తే సీతను పట్టుకోవడం ఈజీ' అంటూ చెప్పే డైలాగ్‌లతో వచ్చే దుల్కర్‌ ఎంట్రీ, ఆయన నటన, సంభాషణలు హృదయాన్ని మెలిపెట్టేలా సాగాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జ్ణానవేల్ కొత్త సినిమా..

'జై భీమ్' సినిమాతో హిట్​ కొట్టిన తమిళ దర్శకుడు జ్ణానవేల్.. తన కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. తన కొత్త సినిమా పేరు 'దోశ కింగ్' అనే పేరును పెట్టుకున్నారు.​ 2001లో జరిగిన హత్య కేసులో నిందితుడైన హోటల్ వ్యాపారి రాజగోపాల్‌తో జీవజ్యోతి శాంతకుమార్ అనే మహిళ ఎలా న్యాయ పోరాటం చేసింది.. అనే యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను తయారు చేశారు జ్ణానవేల్. అన్ని భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన హక్కులను జంగ్లీ పిక్చర్స్ అనే సంస్థ తీసుకుంది.

శరవణ భవన్ వ్యవస్థాపకుడు రాజగోపాల్.. తన రెస్టారెంట్‌లో పని చేస్తున్న ఉద్యోగి కుమార్తె జీవజ్యోతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. అయితే అప్పటికే జీవజ్యోతికి వివాహం జరిగింది. ఈ క్రమంలో జీవజ్యోతిని పెళ్లి చేసుకోవడానికి.. ఆమె భర్త ప్రిన్స్ శాంతకుమార్‌ను అంతమొందించేందుకు రాజగోపాల్ కుట్ర పన్నుతాడు. 2001లోప్రిన్స్ శాంతకుమార్ మృతదేహం కర్ణాటకలోని కొడైకెనాల్ నగరంలో గుర్తించారు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ. ఈ సందర్భంగా జ్ఞానవేల్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో ఈ కేసును నిశితంగా పరిశీలించినట్లు చెప్పారు.

పఠాన్​లో దీపిక లుక్​: బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారూక్‌, పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'పఠాన్‌'. తాజాగా ఈ సినిమాలోని దీపికా పదుకొణె లుక్​ను విడుదల చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 'పఠాన్‌'ను విడుదల చేయనున్నారు. షారూక్​, దీపిక కాంబినేషన్​లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీపిక లుక్​ను చూశాక.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

'డార్లింగ్స్' ట్రైలర్​: అలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డార్లింగ్స్'. ఈ సినిమా ట్రైలర్​ను సోమవారం విడుదల చేశారు. ముంబయి నేపథ్యంలో సాగే.. ఓ కామెడీ ఎంటర్​టైనర్​ ఈ సినిమా. ఈ సినిమా ఆలియా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అలియా, షెఫాలీల కెమిస్ట్రీ ట్రైలర్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆగస్టు 5 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్​ కానుంది. షారూక్​ 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' సహకారంతో ఆలియా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆలియా బ్యానర్​ 'ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్'కు ఇది మొదటి సినిమా.

ఇదీ చదవండి: కత్రినా కైఫ్- విక్కీ కౌశల్​ జంటకు చంపేస్తామని బెదిరింపులు

Last Updated : Jul 25, 2022, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.