ETV Bharat / entertainment

'జబర్దస్త్​ వల్లే మా అమ్మకు మంచి వైద్యం.. కానీ ఆ విషయంలో మాత్రం..' - జబర్దస్త్​ ఆర్టిస్ట్​ కార్తీక్​

మిమిక్రీ ఆర్టిస్ట్​గా హైదరాబాద్​లో అడుగుపెట్టి.. జబర్దస్త్​లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్​. సాధారణ కంటెస్టెంట్​ నుంచి టీమ్​ లీడర్​గా ఎదిగి.. కెరీర్​లో విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. తాజాగా తన వ్యక్తిగత జీవితం, కెరీర్​ గురించి ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు. అవేంటో అతని మాటల్లోనే తెలుసుకుందాం.

kevvu Karthik
కెవ్వు కార్తీక్
author img

By

Published : Jun 13, 2022, 8:05 AM IST

కెవ్వు కార్తీక్​.. ఒక సాధారణ కంటెస్టెంట్​గా జబర్దస్త్​లో తన ప్రయాణం మొదలు పెట్టి టీమ్​ లీడర్​గా ఎదిగాడు. కంటెస్టెంట్​​గా, టీమ్​ లీడర్​గా తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన అతడు.. జబర్దస్త్​ వల్లే తన తల్లిని కాపాడుకోగలిగినట్లు చెప్పాడు. ఇంకా తన లైఫ్​, కెరీర్​ గురించి ఇంకా ఏమన్నాడంటే..

కెవ్వు కార్తీక్

2013లో జబర్దస్త్​ ప్రారంభమైన తర్వాత.. తాను 2015 మొదట్లో ఒక సాధారణ కంటెస్ట్​గా అడుగుపెట్టానని, మొదట ధన్​రాజ్​ టీమ్​లో చేసినట్లు చెప్పాడు కార్తీక్​. ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్​ టీమ్​లో ఆరో కంటెస్ట్​గా చేసినట్లు తెలిపాడు. 2016లో ముక్కు అవినాశ్​తో టీమ్​ లీడర్​గా అవకాశం వచ్చిన తర్వాతే.. తన కేరీర్​లో చాలా మార్పులు వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్​ లీడర్​గా కొనసాగుతున్నానని, అందుకు జబర్దస్త్​కు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు.

"మాది వరంగల్​. అక్కడే ఇంజినీరింగ్​ పూర్తి చేసి హైదరాబాద్​ వచ్చాను. మిమిక్రీ ఆర్టిస్ట్​గా చాలా తక్కువ పేమెంట్స్​కు షోలు చేస్తూ ఉన్నాను. జబర్దస్త్​ ద్వారా అందరు గుర్తుపట్టడం ప్రారంభించారు. నేను 2016లో అమెరికా వెళ్లాను. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, సింగపూర్​, మలేసియా వంటి చాలా దేశాలు తిరిగాను. మారుమూల గ్రామంలో పుట్టిన మనం ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగువారికి తెలుసు అనేదే పెద్ద విజయం. 2016లో దోహా విమానాశ్రయంలో కనెక్టింగ్​ విమానం కోసం చూస్తుండగా ఒక పెద్దావిడ బుర్కా వేసుకుని వచ్చి ఆటోగ్రాఫ్​ అడిగింది. చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు నేను ఒక సాధారణ కంటెస్టునే. ఆ స్థాయిలో ఫేమ్​ తీసుకొచ్చిన షో ఇది. చిరంజీవి, వెంకటేశ్​ వంటి పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడుతూ.. చాలా బాగా చేస్తున్నారంటూ ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. "

- కెవ్వు కార్తీక్​.

జబర్దస్త్​ వల్లే: "మా అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు జబర్దస్త్ నా​ జీవితంలో కీలక పాత్ర పోషించింది. జబర్దస్త్​లో కాకుండా వేరే వృత్తిలో ఉండుంటే నా తల్లి కోసం అంత చేసుండేవాడిని కాదేమో. డబ్బులు మాత్రమే కాదు, ఏ ఆస్పత్రికి వెళ్లినా నాకు సాయం అందేది. ఈ షో చేయటం వల్ల... అందరు గుర్తుపట్టటంతో ఆమెకు మంచి వైద్యం అందిందని భావిస్తున్నా" అని కార్తిక్ చెప్పాడు.

మంచి స్నేహితులం: "జబర్దస్త్​కు ముందే నేను ముక్కు అవినాశ్​ మంచి స్నేహితులం. ​ ఆ తర్వాత కలిసి చేయటం ద్వారా మా బంధం మరింత బలపడింది. వర్క్​ పరంగా ఎలా ఉన్నా.. అవినాశ్​ వేరేదాంట్లో చేస్తున్నా ఇప్పటికీ మేంమంచి స్నేహితులమే" అని కార్తీక్ అన్నాడు.

అదే జబర్దస్త్​ మాకు ఇచ్చింది: జబర్దస్త్​కు వచ్చిన ప్రతి ఆర్టిస్ట్​కు వారి డ్రీమ్స్​.. ఒక విధంగా కాకపోయినా మరో విధంగానైనా నెరవేరుతున్నాయన్నాడు కార్తీక్​. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఆర్థికంగా ఉండాలని, నెలకు కొంత ఆదాయం వచ్చేలా ఉంటే ఇంట్లో పనులకు గానీ, ఇతర వాటికి గానీ ఉపయోగపడుతుందని తెలిపాడు. కారు, ఇల్లు కొనుక్కోవటం, ఇంట్లో వాళ్లను బాగా చూసుకోవటం ద్వారా మన అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పాడు. సాధారణంగా కొన్నింటిని డబ్బులు పెట్టి కొనలేమని, అలా డబ్బులు పెట్టి కొనలేని వాటినే తమకు జబర్దస్త్​ ఇచ్చిందన్నాడు. బయటకెళ్తే చాలా మంది గుర్తు పడుతున్నారని, అంతకంటే ఆనందం ఇంకేకావాలని పేర్కొన్నాడు.

అది ఊహించలేదు: తన కేరీర్​ను ప్రాంభించినప్పుడు అందరికన్నా ముందే తాను ఇల్లు కొనాల్సిందని, తన తల్లి అనారోగ్యానికి గురికావటం, డబ్బులన్నీ వైద్యానికే ఖర్చవటం వల్ల వాయిదా పడినట్లు చెప్పుకొచ్చాడు కార్తీక్​. ఇటీవలే ఇల్లు కొన్నానని, గృహప్రవేశం ఈటీవీలో ప్రసారం కావటం తాను ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశాడు. ఎవరికీ రాని అవకాశం తనకు వచ్చిందని, జబర్దస్త్​కు, ఈటీవీకి కృతజ్ఞతలు తెలిపాడు కార్తీక్​.

"పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు. ఇన్నేళ్లలో ఏనాడు యూట్యూబ్​ కామెంట్లు కానీ, బయట వాళ్లు అన్న మాటలను పట్టించుకోలేదు. ఒక చెవితో విని.. మరో చెవితో వదిలిపెట్టటమే. ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. రోడ్డుపై వెళ్తుంటే ఎవరూ అన్నం పెట్టరు. మనం కష్టపడి పని చేస్తేనే భోజనం దొరుకుతుంది. జబర్దస్త్​తో ఎంత మంది బతుకుతున్నారు. టెక్నీషియన్లు, డైరెక్టింగ్​ డిపార్ట్​మెంట్​, ఆర్టిస్టులు ఇలా ఎంత మంది వాళ్ల జీవితం మారిపోయింది. వారు ఎలా మొదలయ్యారు అనేది ముఖ్యం. ప్రతి ఒక్కరు ఒక పేద కుటుంబం నుంచే వచ్చారు. వారికి ఎలాంటి బ్యాక్​గ్రౌండ్​​ లేదు."

- కెవ్వు కార్తీక్​.

సినిమాలో చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చానని, ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నా ఒక మంచి సినిమాలో క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా చేయాలనేదే తన కోరికగా చెప్పాడు కార్తీక్​. దీంతో పాటు జబర్దస్త్​ ఉన్నంత కాలం ఉంటూ, ఇంట్లో వాళ్లను బాగా చూసుకోవాలని, వీలైనంత సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఒక షో నడవాలంటే అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, స్క్రిప్ట్​ ఉంటే సరిపోదని, దానిని ఆదరించే ప్రేక్షకులు కూడా ఉండాలన్నాడు. ఈ షో హిట్టయిందంటే ప్రేక్షకులే కారణమని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు. ఈ ఆదరణ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు కార్తీక్​.

ఇదీ చూడండి: కారు, ల్యాండ్, ఇల్లు.. అన్నీ సెట్! త్వరలోనే 'విచిత్ర' పెళ్లి!! చిరుతో కలిసి..

'నాకు అమ్మ లేదు.. అన్నీ ఇంద్రజ గారే.. నా కార్​ కోసం ఆమె...'

అసలు ఆ షో ఉందనే తెలియదు.. కట్​ చేస్తే స్టార్​.. బ్లాక్​మెయిల్​ చేసి మరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.