ETV Bharat / entertainment

తక్కువ సమయం ఉన్నా.. ఓ బలమైన పాత్ర పోషించా : ఆషికా రంగనాథ్ - amigos movie release on feb17

సినిమా మొత్తంగా కనిపించను కానీ.. ఉన్నంతలోనే మంచి నటనని ప్రదర్శించే ఓ బలమైన పాత్రని పోషించానన్నారు ఆషికా రంగనాథ్‌. తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మరో కన్నడ సుందరి ఈమె. 'అమిగోస్‌'లో కల్యాణ్‌రామ్‌కి జోడీగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఆషికా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

interview with amigos heroine ashika ranganath
అమిగోస్ హిరోయిన్ ఆషికా రంగనాథ్
author img

By

Published : Jan 29, 2023, 7:14 AM IST

"తన జీవితంలోకి వచ్చే తోడు గురించి ప్రతి అమ్మాయీ కొన్ని కలలు కంటూ ఉంటుంది. అలా తనకి కాబోయేవాడి గురించి రకరకాల కలలు కంటూ... తన అభిరుచికి తగ్గట్టుగా లేడంటూ ప్రతి అబ్బాయినీ తిరస్కరించే ఓ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర చాలా సరదాగా సాగుతుంది. యాషికా అనే ఓ రేడియో జాకీగా కనిపిస్తా. సినిమా మొత్తం ఉండాలనే కోణంలో కాకుండా.. ఒకే రకంగా ఉండే ముగ్గురు వ్యక్తుల కథ కావడం, అందులోనూ కథానాయికగా నా పాత్రకి తగిన ప్రాధాన్యం దక్కడం నచ్చే 'అమిగోస్‌' చేయడానికి ఒప్పుకున్నా. కథానాయకుడి స్థాయిలో తెరపై కనిపించనేమో కానీ.. నేనెప్పుడు వచ్చినా ఆ ప్రభావం సినిమాపై కనిపిస్తుంటుంది".

"తెలుగు సినిమాలు నాకు కొత్త కాదు. చిన్నప్పుట్నుంచి తెలుగు సినిమాలు చూసేదాన్ని, పాటలు వినేదాన్ని. దాంతో నాకు తెలుగు సులభంగానే అర్థమవుతుంది. ఓ వేడుకలో పాల్గొనేందుకని హైదరాబాద్‌కి వచ్చా. అప్పుడే నన్ను ఈ చిత్రబృందం సంప్రదించింది. నేను కథ వినేందుకు సిద్ధమయ్యేలోపే ఈ సినిమా కోసం మరో కథానాయికని తీసుకున్నామని చెప్పారు. తీరా నేను బెంగుళూరు వెళ్లాక మళ్లీ ఫోన్‌ వచ్చింది. అలా దర్శకుడు రాజేంద్రరెడ్డి ఫోన్‌లోనే నాకు కథ వినిపించారు. కథ, పాత్రలు నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. కాస్త ఆలస్యమైనా ఓ మంచి కథతో, మంచి నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాననే తృప్తి ఉంది".

"కల్యాణ్‌రామ్‌ని తొలిసారి 'అమిగోస్‌' సెట్లోనే కలిశా. మొదట ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం తప్ప, మాట్లాడుకోలేదు. చిత్రీకరణ సాగుతున్నకొద్దీ ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. నాకు సంభాషణల విషయంలోనూ ఆయన చాలా సాయం చేశారు. ఈ సినిమాలో మూడు రకాల పాత్రలు చేశారు. ఆ పాత్రల కోసం ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో కళ్లారా చూశాను. పాత్రల విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధని చూసి ఆశ్చర్యపోయా. ఆయన అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా సెట్లో చాలా కూల్‌గా కనిపిస్తుంటారు. సాంకేతిక విభాగాలపై ఆయనకి చాలా అవగాహన ఉంటుంది. కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల మధ్య వ్యత్యాసం అంటూ పెద్దగా ఏమీ లేదు. కానీ ఇక్కడ సినిమాల కాన్వాస్‌ పెద్దది. ప్రచారం కూడా ఘనంగా చేస్తారు. ఇప్పుడు కన్నడలోనూ ఇదే తరహాలోనే సినిమాల ప్రచారం సాగుతోంది".

"కన్నడ నుంచి వచ్చిన కథానాయికలకే కాదు, కథానాయకులకి కూడా తెలుగులో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. నాకు కూడా చాలా మంది తెలుగుకి స్వాగతం అంటూ సందేశం పంపించారు. సినిమా విడుదల కాక ముందే, ఎన్నో రాత్రులొస్తాయి కానీ.. పాటకి సంబంధించిన ప్రచార చిత్రాల్ని చూసే నాపై ప్రేమని కురిపిస్తున్నారు. సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.