ETV Bharat / entertainment

'అవతార్​కు రాముడు, కృష్ణుడే స్ఫూర్తి.. సంస్కృతంపై అభిమానంతోనే అలా..' - avatar 2 behind the scenes

ప్రముఖ దర్శకుడు జేమ్స్​ కామెరూన్​ అవతార్​కు ప్రపంచమంతట ఉన్న క్రేజ్​ అంతాఇంతా కాదు. ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్లిన ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌'. మరి ఆ సినిమా చిత్రీకరణ ఎలా జరిగిందో ఓ సారి చూద్దమా..

avatar 2
avatar 2
author img

By

Published : Dec 4, 2022, 12:57 PM IST

Avatar 2 : జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ 'అవతార్‌'. హైలెవెల్‌ గ్రాఫిక్‌ వర్క్‌తో ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్లిందీ సినిమా. పండోరా లోకం, అక్కడి మనుషులూ, ఆ వింత జీవులూ, వాటితో హీరో చేసే సాహసాలూ ప్రేక్షకలోకాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. దానికి సీక్వెల్‌గా వస్తున్న 'అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌' విశేషాలివి..

avatar 2
జేమ్స్‌ కామెరూన్‌
  • కామెరూన్‌కి హిందూ సంప్రదాయం అంటే అభిమానం. అందుకే 'అవతార్‌' పేరును సంస్కృతం నుంచి తీసుకున్నాడు. మన పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి రూపాల స్ఫూర్తితో 'అవతార్‌' క్యారెక్టర్లకు నీలం రంగును ఎంచుకున్నాడు.
  • 'అవతార్‌ 2'పై భారీ అంచనాలకు కారణం 2009లో 'అవతార్‌' విడుదలైనప్పుడు రేగిన బాక్సాఫీస్‌ దుమారమే. మన కరెన్సీలో మాట్లాడుకుంటే, 'అవతార్‌' నిర్మాణ విలువ రూ.1200 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24 వేల కోట్ల రూపాయల వసూళ్లను(రీ రిలీజ్‌ వసూళ్లను కూడా కలిపి)రాబట్టింది. ఇదే ఇప్పటి వరకూ నమోదైన భారీ రికార్డ్‌. ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన మరో సినిమా ఏదీ భూమ్మీద లేదు.
    avatar 2
    అవతార్​ 2 బిహైండ్​ ద సీన్స్​
  • 'అవతార్‌' చరిత్రాత్మక విజయంతో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సీక్వెల్‌ ప్రకటించాడు. మొదట్లో 2014లోనే 'అవతార్‌2' విడుదల చేద్దాం అనుకున్నారు కానీ, విపరీతమైన ప్రీ ప్రొడక్షన్‌ పనుల కారణంగా పలు మార్లు వాయిదా పడింది. తరవాత కొవిడ్‌ ప్రభావం కారణంగా నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఎట్టకేలకు 'అవతార్‌ 2' షూటింగ్‌, ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ నెల్లో విడుదలకు సిద్ధమైంది.
    avatar 2
    అవతార్​ 2 బిహైండ్​ ద సీన్స్​
  • ఏకంగా 160 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేశారు. ఇప్పటి వరకూ 160 భాషల్లో ఒకేసారి విడుదలైన చిత్రం మరొకటి లేదు. అందుకే ఇది సినీ చరిత్రలోనే రికార్డ్‌. భారీసాంకేతిక ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఈ చిత్రాన్ని త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్‌లలో రిలీజ్‌ చేయనున్నారు.
  • 'అవతార్‌2' నిర్మాణ విలువ రూ.3000 కోట్లపైనే. ఆ తరవాత తీయబోయే 'అవతార్‌' సీక్వెల్స్‌కూ కేటాయించిన బడ్జెట్‌ను కూడా కలుపుకుంటే మొత్తంగా దాదాపు రూ.11,300 కోట్లు ఖర్చు చేస్తున్నాడు కామెరూన్‌. అందుకే ప్రపంచ సినిమా చరిత్రలో ఇంత ఖరీదైన మూవీ సిరీస్‌ మరేదీ లేదు.
  • ఈ సినిమా అధిక భాగం నీళ్లలోనే చిత్రీకరించడం విశేషం. అండర్‌వాటర్‌ పిక్చరైజేషన్‌ కావడం వల్ల చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్నారు. అంతేకాదు, షూటింగ్‌కోసం 9లక్షల గ్యాలన్ల నీళ్లను నిల్వ చేయగల వాటర్‌ ట్యాంకుల్ని ప్రత్యేకంగా తయారు చేయించారు.
avatar 2
అవతార్​ 2 బిహైండ్​ ద సీన్స్​
  • నీటిలో చిత్రీకరణ మొదలుపెట్టడానికి ముందు నటీనటులకూ, టెక్నీషియన్లకూ ఫ్రీ డైవింగ్‌, స్కూబా డైవింగ్‌ నేర్పించారు. ప్రతి ఒక్కరికీ ఈత వచ్చి ఉండాలనే నిబంధనా పెట్టారు. నీళ్లలో షూటింగ్‌ జరిగినన్ని రోజులూ వైద్యుల్నీ అందుబాటులో ఉంచారు.
  • ఇందులో మొదటిపార్ట్‌లో నటించినవాళ్లతోపాటు కొందరు కొత్తవాళ్లూ కనిపిస్తారు. హాలీవుడ్‌ నటుడు విన్‌డీజిల్‌, 'టైటానిక్‌' హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌ కూడా నటించారు.
  • పనిపట్ల నిబద్ధత, రాజీ పడని ధోరణి వల్ల కామెరూన్‌ నటీనటుల పట్ల దూకుడుగా వ్యవహరించేవాడు. 'టైటానిక్‌' తరవాత అందులో హీరోయిన్‌గా నటించిన కేట్‌ విన్‌స్లెట్‌ ఇంకెప్పుడూ కామెరూన్‌తో నటించకూడదని నిర్ణయించుకుందట. అయితే, ఆయన విజయాల్ని చూశాక 'అవతార్‌2'కి అడగ్గానే ఒప్పేసుకుందట.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో నటించింది. ఓ సీన్‌కోసం ప్రాణం మీదకే తెచ్చుకుంది విన్‌స్లెట్‌. షూటింగ్‌లో భాగంగా కొద్దినిమిషాలు ఊపిరి బిగపట్టి నీటిలో ఉండిపోయింది. ఆ సీన్‌ పూర్తయ్యేసరికి ఆమె మైండ్‌ బ్లాంక్‌ అయిందట. తేరుకున్నాక నేనింకా బతికే ఉన్నానా అనుకుందట విన్‌స్లెట్‌.
  • మనదేశంలో ఇంగ్లిష్‌, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ తదితర భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా టికెట్ల విషయంలోనూ రికార్డు సృష్టిస్తోంది. బెంగళూరు, కోల్‌కతా, ముంబయి వంటి చోట్ల దాదాపు 1500 రూపాయలు పలుకుతున్నాయి టికెట్‌ ధరలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.