India's Richest Actress : సినిమా హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్లు పేరుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తుంటారు. సినిమాల ద్వారానే కాకుండా వారికున్న క్రేజ్‌తో ఎండార్స్మెంట్, యాడ్స్ చేస్తూ సంపద పెంచుకుంటున్నారు. అయితే క్రేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లు సైతం హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఎవరై ఉంటారని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఆ నటి ఎవరో తెలుసుకుందామా?
ప్రియాంక చోప్రా జోనాస్ బాలీవుడ్లో రెండో అత్యంత సంపన్న నటిగా నిలిచింది. సినిమాలు, ప్రకటనలతోపాటు ఆమెకు అనోమలీ, అనే బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీ, పర్ఫెక్ట్ మూమెంట్ అనే గార్మెంట్ కంపెనీ ఉన్నాయి. వీటితోపాటు న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్ కూడా ఆమె బిజినెస్‌లో భాగమే. ఇవే కాకుండా పర్పుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ కూడా డబ్బు సంపాదిస్తుంది. ఇక ప్రియాంక అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ప్రియాంక నెట్‌వర్త్ దాదాపు రూ.600 కోట్లు.
ఒక సినిమాకు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్లు వసూలు చేసే ఆలియా భట్ నెట్‌వర్త్ పరంగా బాలీవుడ్లో మూడో సంపన్న నటిగా ఉంది. ఆమె ఇటీవలె ఎడ్-ఎ-మమ్మా అనే బ్రాండ్ గార్మెంట్స్ ప్రారంభించింది. దీని టర్నోవర్ ఏడాదికి రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే కాకుండా ఎటర్నల్ సన్‌షైన్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. డ్యూరోఫ్లెక్స్, అవార్, క్యాడ్బరీ, క్వాలిటీ వాల్స్, కార్నెట్టో, ఫ్రూటీ వంటి కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది ఆలియా. దీంతో ఆమె ప్రస్తుత నెట్‌వర్త్ రూ.550 కోట్లుగా ఉంది.
దీపికా పదుకొనె ఒక్కో సినిమాకి రూ. 25 నుంచి రూ. 30 కోట్లు వరకు తీసుకుంటుంది. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం ప్రకటనల నుంచే వస్తుంది. ఆమె ఏషియన్ పెయింట్స్, లాయిడ్, జాగ్వార్, జియో, లోరియల్, తనిష్క్, కోకా-కోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీల ప్రకటనల్లో నటిస్తుంది. దీంతో పాటు ఆమె 82E అనే బ్యూటీ ప్రొడక్ట్ కంపెనీకి యజమాని కూడా. దీపికా మొత్తం నికర విలువ దాదాపు రూ. 500 కోట్లు. బాలీవుడ్‌లోని అత్యంత ధనిక నటీమణుల జాబితాలో దీపికా నాలుగో స్థానంలో ఉంది. ఇక రూ.485 కోట్ల నికర విలువతో సీనియర్ నటి కరీనా కపూర్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. కరీనా ఒక సినిమాకు రూ. 10 కోట్లు, ఒక ప్రకటనకు రూ. 6 కోట్లు దాకా ఛార్జ్ చేస్తుంది. స్టేజ్ షోలు, రేడియో షోల ద్వారా సైతం ఆమె డబ్బు సంపాదిస్తుంది.
సీనియర్ బ్యూటీ కత్రినా కైఫ్ రూ. 264 కోట్ల నెట్‌వర్త్‌తో ఈ లిస్ట్‌లో ఆరో స్థానం దక్కించుకుంది. ఈ భామ సినిమాకు రూ.7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు, ఒక్కో ప్రకటనకు దాదాపు రూ.7 కోట్లు వసూలు చేస్తుంది. అందరిలాగే కత్రినా కూడా కే బ్యూటీ అనే బ్యూటీ ప్రొడక్ట్ ద్వారా ఏటా దాదాపు రూ.100 కోట్ల వరకు సంపాదిస్తుంది. కాగా, రూ. 255 కోట్ల నికర విలువతో విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 7వ స్థానంలో, రూ. 250 కోట్ల వ్యాల్యూతో మాధురీ దీక్షిత్ ఎనిమిదో స్థానం, రూ. 235 కోట్లతో కాజోల్ తొమ్మిదో స్థానంలో, రూ.206 కోట్లతో రాణీ ముఖర్జీ పదో స్థానంలో ఉన్నారు.
అయితే ఒకప్పుడు బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ లిస్ట్‌లో అందరి కంటే టాప్‌లో ఉంది. ఆమె దాదాపు రూ.800 కోట్ల నెట్‌వర్త్‌తో బీ టౌన్‌తో పాటు దేశంలోనే రిచ్చెస్ట్ హీరోయిన్గా నిలిచింది. ఆమె కొన్నాళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా, ఇప్పటికీ ఐశ్వర్యనే టాప్‌లో ఉంది. ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు, ప్రకటనలకు రూ.7 నుంచి రూ. 8 కోట్లు ఛార్జ్ చేస్తుంది.
'సలార్' ప్రైజ్ హైక్- యూఎస్‌లో 25వేల టికెట్లు సోల్డ్- మల్టీప్లెక్స్‌లో ధర ఎంతంటే?