ETV Bharat / entertainment

'అతడు నన్ను మోసం చేయలేదు.. కావాలనే విడిపోయాం'.. రూమర్స్​పై రష్మిక స్పందన - rashmika animal movie

ఇటీవల తన గురించి వచ్చిన వార్తలపై రష్మిక మందన్నా స్పందించారు. తన మేనేజరుతో విభేదాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలన్నీ వదంతులేనని చెప్పారు. తాజాగా ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చారు.

rashmika mandanna manager
పుకార్లపై క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్నా
author img

By

Published : Jun 22, 2023, 11:04 PM IST

Updated : Jun 23, 2023, 6:23 AM IST

తన వ్యక్తిగత మేనేజరు డబ్బులు కాజేశాడంటూ ఇటీవల వచ్చిన వార్తలను ప్రముఖ హీరోయిన్‌ రష్మిక మందన్నా కొట్టిపారేశారు. తమ ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయంటూ జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండించారు. తామ మధ్య ఎటువంటి గొడవలు లేవని రష్మిక స్పష్టం చేశారు. 'మా ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. మా దారులు వేరు. కెరీర్‌లో ఎవరికి వారు స్వయంగా ఎదగాలని అనుకున్నాం. అందువల్లే.. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నాం. మేము ప్రొఫెషనల్స్‌. చేసే ఏ పనికి అయినా కట్టుబడి ఉంటాం' అని ఆమె తెలిపారు.

ఇంతకీ ఏంటి ఆ రూమర్స్..
సినిమా షూటింగుల్లో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నాను.. ఆమె వ్యక్తిగత మేనేజరు ఆర్థికంగా మోసం చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. రష్మికకు తెలియకుండా.. దాదాపు రూ. 80 లక్షలు కాజేశాడని పలు వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి. దీంతో తనను మోసం చేశాడన్న కారణంగా రష్మిక.. అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారంటూ వార్తలు వచ్చాయి. సినిమా కెరీర్ ఆరంభం నుంచి తనతోనే ఉన్న మేనేజరు చేసిన ఈ పనికి రష్మిక చాలా బాధ పడ్డారంటూ వివిధ రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాలు ఎక్కువ అవుతున్న కారణంగా రష్మిక స్వయంగా స్పందించారు. తన మేనేజరుకు తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

రష్మిక తాజాగా యానిమల్‌ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్​ను పూర్తి చేసుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్​ సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న ఈ యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా.. దర్శకుడు సుకుమార్‌ పాన్‌ ఇండియా లెవెల్​లో తెరకెక్కిస్తున్న పుష్ప: ది లో రష్మిక నటిస్తున్నారు.

గతేడాది కూడా ఆమెపై కొన్ని పుకార్లు వచ్చాయి. ఆమెను కన్నడ సినీ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని వార్తలు వచ్చాయి.తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు ఎత్తకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అని రష్మిక సంభోదించడం కన్నడ సినీ ప్రేక్షకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తరచూ ఆమె కన్నడ పరిశ్రమను అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నందున తట్టుకోలేని కన్నడిగులు ఆమెపై వేటు వేసేందుకు సిద్ధపడ్డారట. ఈ క్రమంలో కర్ణాటకలోని థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ పరిశ్రమతో సహా ఆమెకు వ్యతిరేకంగా నిలుస్తోందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Jun 23, 2023, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.