ETV Bharat / entertainment

సినిమాల్లో నయా ట్రెండ్​.. హీరోస్ విత్​ 'గన్స్'.. విలన్స్​పై దండయాత్రే! - కమల్ హసన్​ విక్రమ్ సినిమా

సినిమాల్లో కొత్త ట్రెండ్​కు శ్రీకారం చూట్టారు దర్శకులు. ఫైట్​ సీన్స్​లో ఇంతకుముందు హాకీ స్టిక్​లు, క్రికెట్ బ్యాట్లు ఉపయోగించేవారు. కానీ ఆడియోన్స్ పల్స్ తెలుసుకున్న డైరెక్టర్లు.. గత కొద్దికాలంగా హీరోల చేతికి గన్ ఇస్తున్నారు. అలా గన్స్​తో హీరోల లుక్స్ ఎలా ఉన్నాయో చూసేయండి.

indian-actors-with-guns-from-tollywood-to-bolywood-heros-poses-with-guns

author img

By

Published : Aug 4, 2023, 11:41 AM IST

గత కొద్దికాలంగా వస్తున్న సినిమాల్లో ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే భేదం లేకుండా స్టార్ హీరోల చేత గన్ పట్టిస్తున్నారు ఆయా దర్శకులు. సినిమాల్లో హీరోలు గన్​తో రౌడీలను షూట్​ చేస్తుంటే ​థియేటర్లలో ఫ్యాన్స్​ విజిల్స్​ వేయాల్సిందే. అలా ఒక్క దెబ్బకే హీరోలు విలన్​ల భరతం పడుతుంటే ప్రేక్షకులు పూనకాలు ఊగిపోతున్నారు. అయితే ఆడియెన్స్ పల్స్ తెలుసుకున్న మూవీమేకర్స్​ కూడా సినిమాల్లో 'గన్ పోస్టర్'లనే హైలైట్ చేసి చూపిస్తున్నారు. మరి ఆ పోస్టర్లపై ఓ కన్నేద్దామా..

Jailer Movie : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం జైలర్. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మూవీయునిట్ రజనీ క్రేజ్​కు గన్ జోడించి.. సినిమాపై అంచనాలు పెంచేశారు.

Dhanush Captain Miller : ధనుష్ హీరోగా, డైరెక్టర్ అరుణ్ మతేశ్వరణ్ తెరకెక్కిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా పోస్టర్​లో హీరో ధనుష్ ఓ భారీ గన్​ను పట్టుకొని రౌద్రంగా కనిపిస్తున్నారు.

Bhola Shankar : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గాడ్​ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల్లో గన్ పట్టుకొని ఫ్యాన్స్​ను అలరించారు. తాజాగా భోళా శంకర్​లోనూ చిరంజీవి.. రెండు చేతుల్లోనూ ఏకే 47 లాంటి గన్స్​తో విలన్స్​పై దాడికి వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్​ను రిలీజ్ చేశారు.

Jawaan : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్.. జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రేమ కథ చిత్రాలు తీసే దర్శకుడు అట్లీ.. ఈ సినిమాలో ఫుల్​ మాస్ టచ్​ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్​లో రిలీజ్ కానుంది.

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్​లో రాబోతున్న చిత్రం సలార్. ఈ సినిమాపై ముందు నుంచే అంచనాలు పీక్స్​లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్​ను కూడా రిలీజ్​ చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా పోస్టర్​లో.. మాస్​లుక్​లో ప్రభాస్ అదిరిపోయారు.

Gandeevadhari Arjuna : మెగా హీరో వరుణ్​తేజ్​ కూడా ఈ లిస్ట్​లో చేరిపోయారు. తాజాగా గాండీవధారి అర్జున సినిమా పోస్టర్​లో.. వరుణ్ గన్​తో కనిపించారు.

Saindhav : కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చే విక్టరీ వెంకటేశ్ కూడా రూటు మార్చారు. కొత్త చిత్రం సైంధవ్​ పోస్టర్​లో ఓ భారీ గన్​తో ఊర మాస్​గా కనిపిస్తున్నారు.

Nikhil Spy : ఇటీవల రిలీజైన 'స్పై' సినిమాలో నిఖిల్.. గన్​తో ఫ్యాన్స్​కు కిక్​ ఇచ్చారు.

KGF 2 : బ్లాక్​బస్టర్ చిత్రం కేజీఎఫ్​లో హీరో యశ్​.. ఓ భారీ గన్​తో బీభత్సమే సృష్టిస్తారు. సినిమాలోని ఈ సీన్​కు థియేటర్లలో బాక్సులు బద్దలయ్యాయి.

Kamal Haasan Vikram : లోకేశ్ కనగరాజ్, సీనియర్ నటుడు కమల్ హసన్​తో విక్రమ్ సినిమా తెరకెక్కించారు. గతేడాది ఈ సినిమా మంచి విజయం సాధించింది. క్లైమాక్స్​లో కమల్ హసన్.. గన్​తో రఫ్పాడించారు.

Akhil Agent : అక్కినేని ప్రిన్స్ అఖిల్.. ఏజెంట్​లో గన్​తో మెరిశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.