Indian Actors Most 500 CR+ Movies : భారతీయ సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతుంది. భాష ఏదైనా కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో ప్రాంతీయ భాష సినిమాలు హద్దులు చెరిపేస్తూ.. దేశ ఎల్లలు దాటుతున్నాయి. ఈ క్రమంలో కొందరు హీరోలకు వంద కోట్ల మార్క్‌ను అందుకోవడం సాధారణమైపోయింది. అలా తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.
ఇక ఈ సినిమా ఇప్పటికే రూ 500+ కలెక్షన్స్ అందుకుంది. అయితే ఈ రేంజ్ కలెక్షన్స్‌ను రజనీ అంతకముందు.. రోబో 2.O సినిమాతో సాధించారు. దీంతో రజనీ రెండుసార్లు ఐదు వందల కోట్ల క్లబ్లో చేరారు. ఈ క్రమంలో ఒకటికంటే ఎక్కువ సార్లు రూ. 500 కోట్ల క్లబ్లో చేరిన ఆ స్టార్ హీరోలెవరో చూద్దాం..
Aamir Khan 500 CR Movies : బాలీవుడ్ అగ్రహీరోల జాబితాలో అమీర్‌ఖాన్ ముందు వరుసలో ఉంటారు. ఆయన కీలక పాత్రలో నటించిన 'దంగల్' చిత్రం అప్పట్లో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రముఖ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫొగాట్. అతడి కుమార్తెల జీవితాన్ని ఆధారంగా తీసుకొని.. దర్శకుడు నితీశ్ తివారీ ఈ సినిమాను తెరకెక్కించారు. మహిళలు సైతం రెజ్లింగ్ వైపు రావడానికి ప్రోత్సాహించే విధంగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో రికార్డు సృష్టించింది.
కాగా ఈ సినిమా హిట్‌టాక్ అందుకొని వెయ్యి కోట్లు పైనే వసూళ్లు సాధించింది. అలాగే అమీర్‌ఖాన్ నటించిన.. 'సీక్రెట్ సూపర్‌స్టార్', 'పీకే', 'ధూమ్ 3' సినిమాలు కూడా రూ. 500+ కలెక్షన్లు సాధించాయి. దీంతో నాలుగు సార్లు ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిన లిస్ట్‌లో అమీర్‌ఖాన్ టాప్‌లో కొనసాగుతున్నారు.
Salman Khan 500 CR Movies : బాలీవుడ్ బ్యాచిలర్, కండల వీరుడు సల్మాన్‌ఖాన్.. తన కెరీర్లో మూడు సార్లు రూ. 500+ కోట్ల వసూళ్లు సాధించారు. 'బజరంగీ భాయ్‌జాన్', 'సుల్తాన్', 'టైగర్ జిందాహై' సినిమాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు.
Prabhas 500 CR Movies : ఈ లిస్ట్‌లో రెబల్ స్టార్ మూడో ప్లేస్ దక్కించుకున్నారు. దర్శకధీరుడు రాజమాళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచాయి. దీంతో బాహుబలి ది బిగినింగ్ రూ. 1000 కోట్లు రాబట్టింది. దీంతో ఈ క్లబ్లో చేరిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా మార్కెట్ పెరిగిపోయింది.