ETV Bharat / entertainment

'భారతీయుడు- 2' షూటింగ్ కంప్లీట్- శంకర్ నెక్ట్స్ టార్గెట్ 'గేమ్ ఛేంజర్'! - కమల్​ హాసన్ ఇండియన్ 2

Indian 2 Movie Shooting: కమల్​హాసన్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'భారతీయుడు-2' సినిమా షూటింగ్ ముగిసినట్లు మూవీటీమ్ తెలిపింది. కమల్- శంకర్​ కెరీర్​లో అత్యధిక రోజులు చిత్రీకరణ జరుపుకున్న సినిమాగా భారతీయుడు 2 నిలిచింది.

indian 2 movie shooting
indian 2 movie shooting
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 1:51 PM IST

Updated : Jan 2, 2024, 3:13 PM IST

Indian 2 Movie Shooting : ప్రముఖ కథానాయకుడు కమల్​హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'భారతీయుడు- 2' షూటింగ్ ఎట్టకేలకు ముగిసింది. 90ల్లో వచ్చిన 'భారతీయుడు ​-1'కు సీక్వెల్​గా ఈ చిత్రాన్ని రూపొందించారు. చెన్నైలో జరిగిన చివరి షెడ్యూల్​తో ఈ సినిమా చిత్రీకరణ కంప్లీట్​ అయ్యింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ షేర్ చేసింది. ఈ ఫొటోలో హీరో కమల్​హాసన్​తోపాటు సినిమాకు పనిచేసిన టెక్నిషియన్లు ఉన్నారు. అయితే కమల్​హాసన్, శంకర్ కెరీర్​లో ఎక్కువ కాలం షూటింగ్​ జరిగిన సినిమా భారతీయుడు- 2 నిలిచింది.

దర్శకుడు శంకర్ ఈ ప్రాజెక్టును 2015లో ప్రకటించారు. ప్రీ పొడక్షన్ పూర్తైన తర్వార 2018లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. అయితే వివిధ కారణాల వల్ల 2020లో భారతతీయుడు- 2 చిత్రీకరణ ఆగిపోయింది. ఈ క్రమంలో కమల్​హాసన్ రంగంలో దిగి మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యేలా చేశారు. అలా 2022లో చిత్రీకరణ ప్రారంభం అయింది. గ్లోబర్ స్టార్ రామ్​చరణ్​తో గేమ్​ ఛేంజర్ సినిమాకు వర్క్​ చేస్తూనే, భారతీయుడు-2ను కూడా డైరెక్ట్​ చేశాడు. ఈ సినిమా దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది.

Indian 2 Movie Cast : ఇక ఇండియన్​-2 సినిమా విషయానికి వస్తే భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నయనతార, కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, వివేక్, అజయ్ దేవ్​గన్, లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత సుభాస్కరణ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు, రవి వర్మ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ చిత్రీకరణ ముగిసినందున, శంకర్ నెక్ట్స్​ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్' రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఇండియన్-2' ఇంట్రో రిలీజ్​, 'భారతీయుడుకు చావే లేదు' అంటున్న కమల్

8000 మందితో సినిమా షూటింగ్​ - భారతీయుడి కోసం శంకర్​ భారీ ప్లాన్​​!

Last Updated : Jan 2, 2024, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.