ETV Bharat / entertainment

'నాలా మీరెప్పుడు బాధపడకూదడని ప్రార్థిస్తున్నా'.. ట్రోల్స్​కు సమంత స్ట్రాంగ్ కౌంటర్ - సమంత శాకుంతలం సినిమా

గత కొంత కాలంగా మయోసైటిస్​ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం దాని కోసం చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా శాకుంతలం ట్రైలర్​ లాంచ్​లో సామ్​ను చూసిన నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను షేర్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్​లో వచ్చిన ఓ ట్వీట్​ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

samantha latest twitter post
samantha
author img

By

Published : Jan 10, 2023, 9:30 AM IST

సమంత 'శాకుంతలం' ట్రైలర్​ లాంచ్ కార్యక్రమం సోమవారం గ్రాండ్​గా జరిగింది. చాలా కాలం తర్వాత సామ్​ను చూసిన ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు. ప్రస్తుతం సమంత ఫొటోస్​ సోషల్​ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే సమంతపై సామాజిక మాధ్యమాల్లో ఓ పేజీ పెట్టిన పోస్ట్​ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
ట్విట్టర్​కు చెందిన బజ్​ బాస్కెట్​ అనే ఓ పేజీ​ సమంత ఫొటోలతో ఓ క్యాఫ్షన్​ ఇమేజ్​ను షేర్​ చేసింది. "సమంతను చుస్తుంటే బాధనిపిస్తోంది. ఆమె తన అందాన్ని కోల్పోయింది. విడాకుల నుంచి బయటపడ్డ ఆమె సినీ కెరీర్​లో టాప్​లో ఉన్న టైమ్​లో మయోసైటిస్ వ్యాధి వల్ల ఆమె మరింత బలహీనురాలయ్యింది" అని ఆ పోస్టులో రాసుకొచ్చారు.

  • I pray you never have to go through months of treatment and medication like I did ..
    And here’s some love from me to add to your glow 🤍 https://t.co/DmKpRSUc1a

    — Samantha (@Samanthaprabhu2) January 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ పోస్ట్​ చూసిన సామ్​ ఫ్యాన్స్​ ఆ పేజీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ పోస్టు సామ్​ కంట కూడా పడింది. దీనికి ఆమె దీటుగా రిప్లై ఇచ్చారు. "నేను తీసుకున్న విధంగా మీరు నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్​ను చూసిన ఫ్యాన్స్​ సైతం సామ్​కు సపోర్ట్​ చేస్తూ మరిన్ని ట్వీట్స్​ చేశారు.
అయితే యశోద మూవీ టైంలో 'మయోసిటిస్' అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఓ ఇన్​స్టా పోస్ట్​ ద్వారా తెలిపారు. ట్రీట్మెంట్​ తీసుకుంటూనే మూవీకి డబ్బంగ్​ చెప్పిన సామ్​.. మళ్లీ చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.