ETV Bharat / entertainment

మనుషులే కాదు.. 'రెబల్​ స్టార్'​ స్నేహానికి పులి కూడా ఫిదా! - actor krishnam raju rebelstar how

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. అయితే ఓ సినిమాలో కృష్ణంరాజు పులితో ఫైట్‌ చేయాల్సివచ్చింది. అందుకు చిత్ర బృందం ఓ పులిని తీసుకొచ్చింది. ఎంతటి శిక్షణ తీసుకున్నదైనా పులి.. పులే కాబట్టి సెట్స్‌లోకి రాగానే గాండ్రించిందట. దీంతో వెంటనే రెబల్​ స్టార్​ పులిని మచ్చిక చేసుకుని ఆ పోరాట దృశ్యాల్ని అద్భుతంగా తెరకెక్కినట్టు చేశారట.

actor krishnam raju
actor krishnam raju
author img

By

Published : Sep 11, 2022, 11:43 AM IST

వెండితెర 'భక్త కన్నప్ప' ఇకలేరు. 'బొబ్బిల బ్రహ్మన్న'లాంటి వారు మరొకరు రారు. 'తాండ్ర పాపారాయుడు'లా గర్జించే గొంతుక ఇకపై వినిపించదు. 'ఉగ్ర నరసింహం'లాంటి రూపం కనిపించదు. ఇవన్నీ కృష్ణంరాజుకే సాధ్యం. వెండి తెరపై 'రెబల్‌’స్టార్'గా ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూరిదాయకం. ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన నటించిన సినిమాలు, పాత్రలను అభిమానులు గుర్తు చేసుకుంటూ కృష్ణంరాజుకు నివాళి అర్పిస్తున్నారు.

అప్పటి నుంచే రెబల్‌స్టార్‌గా..
పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల నేపథ్య చిత్రాల్లోనూ కృష్ణంరాజు నటించారు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఆయన 180కి పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. 'చిలకా గోరింక'తో 1966లో తెరంగేట్రం చేసిన కృష్ణంరాజు.. 1978లో వచ్చిన 'కటకటాల రుద్రయ్య' సినిమాతో రెబల్‌ స్టార్‌గా మారారు. ఈ ఒక్క పాత్రే కాకుండా ఇలాంటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లు ఎన్నో ఆయన్ను సాహసిగా నిలిపాయి. తనకెంతో పేరు తీసుకొచ్చిన 'కటకటాల రుద్రయ్య' చిత్రీకరణలో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని కృష్ణంరాజు ఓసారి బయటపెట్టారు. ఈ సినిమాలో కృష్ణంరాజు పులితో ఫైట్‌ చేసే సన్నివేశం ఒకటుంది. దాని కోసం చిత్ర బృందం ఓ పులిని తీసుకొచ్చింది. ఎంతటి శిక్షణ తీసుకున్నదైనా పులి.. పులే కాబట్టి సెట్స్‌లోకి రాగానే గాండ్రించిందట.

actor krishnam raju
కృష్ణంరాజు

కృష్ణంరాజు స్నేహానికి మనుషులే కాదు.. పులి కూడా ఫిదా
'ఇలా అయితే కష్టం' అని అనుకుని దాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారట కృష్ణంరాజు. చివరకు ఆ పోరాట దృశ్యాల్ని అనుకున్నట్టుగా తెరకెక్కించారు. సినిమా విడుదలై, ఘన విజయం అందుకోవడంతోపాటు ఆ ప్రత్యేక సీన్లకు మంచి ఆదరణ దక్కింది. అదే సంవత్సరం మరో సినిమా కోసం ఆ పులిని తీసుకురాగా, అది కృష్ణంరాజుతో ఫైట్‌ చేసేందుకు సహకరించలేదట. 'ఆ పులి నన్ను గుర్తుపట్టి, ఎంతో చనువుగా ఉండేది. దాంతో ఫైట్‌ సీన్‌ అంటే కష్టమనుకుని మరొక పులిని తీసుకొచ్చాం' అని కృష్ణంరాజు అప్పట్లో పేర్కొన్నారు. కృష్ణంరాజు స్నేహానికి మనుషులే కాదు.. పులి కూడా ఫిదా అవుతుందనటానికి ఇదొక నిదర్శనం.

వద్దన్నా వదిలేవారు కాదు!
సినిమాల్లోని పాత్రల్లో గంభీరంగా కనిపిస్తూ తెరపై 'రెబల్‌' స్టార్‌గా వెలుగొందిన కృష్ణంరాజు మనసు వెన్న. అతిథి మర్యాదలో ఆయనకు ఆయనే సాటి. తాను షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఆ సెట్‌లో ఉన్నవారందరికీ కృష్ణంరాజు ఇంటి నుంచే భోజనం వెళ్తుంది. తన టీమ్‌ని అంత బాగా చూసుకునేవారాయన. తీసుకెళ్లడమే కాదు 'ఇక వద్దు సర్‌.. చాలు' అని అన్నా వినేవారు కాదట. ప్రతి ఒక్కరూ కడుపునిండా తినేంత వరకూ ఊరుకునే వారు కాదు. అందుకే ఆయన్ను కొందరు 'మర్యాద రామన్న' అని పిలుస్తుంటారు. కృష్ణంరాజు వారసుడు ప్రభాస్‌ సైతం ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు.

actor krishnam raju
కృష్ణంరాజు

చేతులు కాల్చుకున్నారు..
కృష్ణంరాజు అప్పట్లో వేటకు వెళ్లేవారు. అడవిలోనే వండుకుని తినేవారట. తనకు అన్నం వార్చడం రాదని, పలుమూర్ల చేతులు కాల్చుకున్నానని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఏదో సరదాగా చేసిన ఆ పనిని కొంతకాలం తర్వాత మానేసినట్టు తెలిపారు. కృష్ణంరాజుకు పెసరట్టు, నాన్‌వెజ్‌ అంటే బాగా ఇష్టం.

దాంప్యతం ఇలా ఉండాలి..
కృష్ణంరాజు తన జీవితంలోని ప్రత్యేకమైన రోజులను వేడుకగా జరుపుకొంటారు. కానీ, గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చికోవడం అంటే ఆసక్తి ఉండేది కాదు. 'నా భార్యే నాకు అతి పెద్ద బహుమతి' అని చెప్పిన కృష్ణంరాజు దాంపత్య జీవితం గురించి ఓ సందర్భంలో ఇలా వివరించారు. "భార్యాభర్తలెవరి మధ్య అయినా చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. కాసేపు మౌనంగా ఉంటే తర్వాత అన్నీ సర్దుకుంటాయి. ఇద్దరూ సంపాదించే వారైతే ‘ఇగో’ సమస్యలు తలెత్తుతున్నాయి. 'నేనే గొప్ప అంటే నేనే గొప్ప' అని అనుకుంటున్నారు. దంపతుల మధ్య అది ఉండకూడదు. చిన్న సమస్యను పెద్దగా చేసి చూడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే కాపురం బాగుంటుంది" అని వివరించారు.

actor krishnam raju
కృష్ణంరాజు ఫ్యామిలీ

వివిధ సందర్భాల్లో కృష్ణంరాజు పంచుకున్న మాటలివి..

  • "పుట్టినరోజు అనగానే నాకు నా అభిమానులే గుర్తుకొస్తారు. 'అమరదీపం' నుంచి పరిశ్రమలో నా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దండలు, పుష్ప గుచ్ఛాలతో వచ్చే అభిమానులను ఆ డబ్బుని సమాజ సేవకి ఉపయోగించాలని చెప్పేవాణ్ని. వాళ్లూ అదే పాటిస్తున్నారు. ఇతర కథానాయకుల అభిమానులతోనూ సఖ్యతగా మెలిగేవాళ్లు. దాంతో నాకు విలువ పెరిగింది."
  • "సుదీర్ఘమైన నా సినీ ప్రయాణంలో పరాజయాలు తక్కువే కానీ.. కెరీర్‌ పరంగా చాలా ఒడుదొడుకుల్ని చూశా. నటన పరంగా, నిర్మాణం పరంగానూ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతూ సినిమాలు చేశా. పౌరాణిక నేపథ్య కథలు పెద్దవాళ్లు, మహిళలకి మాత్రమే పరిమితం అనుకొంటున్న పరిస్థితుల్లో 'భక్తకన్నప్ప' చేశా. హిందీలో మాత్రమే ఇలాంటి సినిమాలు సాధ్యం అనుకొంటున్న పరిస్థితుల్లో ‘తాండ్ర పాపారాయుడు’ చేశా. రోజూ 5 వేల మందితో, ఏనుగులు, గుర్రాలతో చిత్రీకరణ చేశాం. ట్రెండ్‌ మారాలని, చిత్ర పరిశ్రమకి మన తోడ్పాటు కూడా ఉండాలనే గోపీకృష్ణ మూవీస్‌ సంస్థని ప్రారంభించాం."
  • "పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల కథల్లోనూ నటించా. కలల పాత్రలంటూ ఏమీ లేవు. కానీ కొత్తగా, ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని పాత్రలేవైనా వస్తే చేయాలనే తపన ఇప్పుడూ ఉంది. 'కటకటాల రుద్రయ్య'తో పాటు అప్పట్లో నేను చేసిన పాత్రలే నాకు రెబల్‌స్టార్‌ అనే పేరును తీసుకొచ్చాయి. నటుడిగా ప్రేక్షకుల్లో నాపై ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని, దీటైన పాత్రలొచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నా."
  • "కేంద్రమంత్రిగా నేను బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి విభాగంలోనూ కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించా. ఎంపీగా నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. 400 ఊళ్లు ఉంటే అన్నిచోట్లా నా ముద్ర కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత డబ్బు ఇస్తే కానీ ఓట్లు వేయని పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వాలు కూడా ప్రజల్ని సోమరిపోతులుగా మార్చకుండా, వాళ్ల ఉపాధికి పనికొచ్చేలాగా అభివృద్ధి పనులు చేయాలి. రైతాంగానికి, అవసరమైన వాళ్లకి మాత్రమే రాయితీలు ఇవ్వాలి."
  • "రాజకీయాల్లోనూ అరుదైన ప్రయాణం నాది. దేశంలో కేంద్రమంత్రి అయిన తొలి కథా నాయకుణ్ని నేనే. అమితాబ్‌ బచ్చన్‌ను కలిసినప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ.. 'మీరు నాకు బాగా తెలుసు,'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో కేంద్రమంత్రి అయిన తొలి కథానాయకుడు ఎవరనే ప్రశ్న అడిగాన'ని చెప్పారు."

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.