ETV Bharat / entertainment

'శాకుంతలం' రిజల్ట్​పై సామ్​ రియాక్షన్​.. ఏమందంటే? - శాకుంతలం ఫ్లాప్​పై సమంత రియాక్షన్​

కాళిదాసు రచించిన అందమైన ప్రేమ కావ్యం అభిజ్ఞాన శాకుంతలం దృశ్యరూపం తెరపై మెరవలేకపోయింది. అయితే దీనిపై హీరోయిన్​ సమంత స్పందించింది. ఏం చెప్పిందంటే?

samantha
శాకుంతలం రిజల్ట్​పై సామ్​ రియాక్షన్​.. ఏమందంటే?
author img

By

Published : Apr 18, 2023, 3:59 PM IST

Updated : Apr 18, 2023, 4:48 PM IST

ప్రముఖ డైరెక్టర్​ గుణ శేఖర్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. మలయాళ యాక్టర్​ దేవ్ మోహన్ మూవీలో దుష్యంతుడిగా నటించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో రీసెంట్​గా ఆడియెన్స్​ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సమంత స్టార్ ఇమేజ్​తో ముందుకు వచ్చిన ఈ చిత్రం కనీసం మంచి ఓపెనింగ్స్ అయినా అందుకుంటుందనుకుంటే ​అవి కూడా అంతగా రాలేదు. ఫస్ట్​ డే నుంచే నెగిటివ్‌ టాక్‌ రావడంతో సినిమా చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. కలెక్షన్స్‌ కూడా దారుణంగా పడిపోయాయి. ప్రమోషన్స్‌తో ఎంత హైప్‌ క్రియేట్‌ చేసినా కొంచెం కూడా వర్కౌట్ కాలేదు. క‌థ‌, క‌థ‌నం, వీఎఫ్ఎక్స్‌, శకుంతల- దుష్యంతుల కెమిస్ట్రీ, సామ్​ డబ్బింగ్‌.. ఇలా ఎన్నో అంశాల్లో శాకుంతలం అభిమానుల్ని నిరాశపరిచింది. సోషల్​మీడియాలో ట్రోల్స్​కు గురైంది. దీంతో వీకెండ్​లో కూడా కలెక్షన్స్​ను సాధించలేకపోయింది. అయితే సినిమా ఫలితంపై 'శాకుంతలం' టీమ్‌ స్పందించలేదు. ఇప్పటివరకు సైలెంట్​గానే ఉంది. కానీ ఈ మూవీ రిజల్ట్​పై హీరోయిన్​ సమంత పరోక్షంగా స్పందించారు. భగవద్గీతలోని అద్భుత శ్లోకాన్ని ఉటంకిస్తూ తన ఫొటోను సోషల్​మీడియాలో షేర్ చేశారు.

కారులో కూర్చొని బయటకు చూస్తూ ఉన్న ఫొటోను షేర్ చేశారు సామ్‌. ఆ ఫొటోకు 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి" అనే గీతా శ్లోకాన్ని క్యాప్షన్​గా రాసుకొచ్చారు. పని చేయడం వరకే నీకు అధికారం. దాని ఫలంతో నీకు సంబంధం లేదు. అందుకే ప్రతిఫలం ఆశించి ఏ పనీ చేయకు. అలా అని పని చేయడం మానకు. అని దాని అర్థం. అంటే విజయాలు వస్తుంటాయి. అపజయాలు ఎదురవుతుంటాయి. అయినా మనం మన పని చేసుకుంటూ ముందుకు సాగాలి అని సమంత 'శాకుంతలం' రిజల్ట్​పై పరోక్షంగా మాట్లాడారు. అలా మూవీ విడుదలైన తర్వాత సోషల్​మీడియాలో వస్తున్న ట్రోల్స్‌కు ఇలా గట్టిగా సమాధానమిచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం సమంత చేతిలో మరిన్ని బాడా ప్రాజెక్ట్​లు ఉన్నాయి. వాటిలో ఇండియన్​ వెర్షన్​ 'సిటాడెల్‌' అతి పెద్దది. అమెరికన్‌ టీవీ సిరీస్‌ను.. భారతీయ ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టుగా దర్శకుల ద్వయం రాజ్‌ అండ్‌ డీకే గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు విజయ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖుషి'లోనూ సామ్​ నటిస్తున్నారు. వీటితో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలిసింది.

ఇదీ చూడండి: Honey Rose : అలా ఉండటమే ఈ ఎర్ర గులాబీకి చాలా ఇష్టమట!

Last Updated : Apr 18, 2023, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.