కెరీర్ ప్రారంభం నుంచి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పూజాహెగ్డే. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన ఆమె చిత్రాలు అంతగా ఆడకపోయినా ఆమె జోరు మాత్రం తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. అయితే ఆమెకు ఓ స్టార్ హీరో వల్ల హార్ట్ బ్రేక్ అయిందట. ఈ విషయాన్ని ఆమె చెప్పింది.
అతనెవరంటే.. బాలీవుడ్లో 'మొహంజోదారో' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూజా. తన తొలి సినిమాతో హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసి లక్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. అయితే హృతిక్ వల్లే తన హార్ట్ బ్రేక్ అయ్యిందనే విషయాన్ని చెప్పిందీ భామ. తనకు చిన్నప్పటి నుండి హృతిక్ అంటే చాలా ఇష్టమట. తన 12 ఏళ్ల వయస్సులో కోయి మిల్ గయా సినిమా విడుదలయ్యిందట. అప్పుడు ఎలాగైనా ఆ సినిమా ప్రీమియర్ షో టికెట్ సంపాదించిన పూజ.. హృతిక్‌తో ఓ ఫోటో దిగాలనుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మ స్టేజ్‌పైకి వెళ్లే సమయానికి హృతిక్ స్టేజ్ దిగి వెళ్లిపోయాడట. దీంతో తాను ఎంతో బాధ పడిందట. అప్పుడే తన హార్ట్ బ్రేక్ అయినంత పనైందట. ఈ విషయాన్ని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక చిన్నప్పుడు తాను ఎంతగానో అభిమానించిన హీరోతోనే కలిసి నటించడం ఎంతో అదృష్టంగా భావించినట్లు తెలిపింది.
ఇదీ చూడండి: పూజాహెగ్డే సక్సెస్ మంత్ర ఆ వాట్సాప్ డీపీ అట అందులో ఏముందో తెలిస్తే