ETV Bharat / entertainment

కోహ్లీ సెంచరీ చూసి కన్నీళ్లొచ్చాయి.. ఆయనే నా రోల్​ మోడల్​ : సమంత - Samantha Star Sports Interview

టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు ప్రముఖ నటి సమంత. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు ప్రస్తావించారు. ఆ వివరాలు..

Samantha Star Sports Interview Comments On Cricketer Virat Kohli
కోహ్లీ 71వ సెంచరీ చూసి కన్నీళ్లు వచ్చాయి.. విరాటే నా రోల్​ మోడల్​: సమంత
author img

By

Published : May 12, 2023, 10:15 PM IST

స్టార్​ క్రికెటర్ విరాట్​ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్​ హీరోయిన్ సమంత. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. 'ఖుషి' సినిమా ప్రమోషన్లలో భాగంగా యంగ్​ హీరో విజయ్​ దేవరకొండతో కలసి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. క్రికెట్‌ విషయంలో తనకున్న అభిరుచులను షేర్​ చేసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ క్రికెట్​ కెరీర్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అంశాన్ని జోడించారు సామ్​.

అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ తన కమ్‌ బ్యాక్‌ సెంచరీ (71వ శతకం) బాదినప్పుడు ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ.. తిరిగి పుంజుకున్న తీరు అద్భుతమంటూ సామ్​ కొనియాడారు. ఇది నిజంగా తనకెంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. అంతేగాక భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని చెప్పారు. ఐపీఎల్‌లో తనకు ఇష్టమైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ అని వెల్లడించారు.

సమంత సినిమాల విషయానికొస్తే.. హీరో విజయ్‌ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్​ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాజీ భర్త కితాబు..
టాలీవుడ్​ స్టార్​ హీరో నాగచైతన్య 'కస్టడీ' సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పలు ఈవెంట్లలో పాల్గొన్న ఆయన తన మాజీ భార్య సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో 'జోష్​' సినిమా నుంచి ఇప్పటివరకూ తాను వర్క్‌ చేసిన హీరోయిన్​లలో ఆయనకు నచ్చిన క్వాలిటీస్‌ గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా తన కో-స్టార్​ సమంత గురించి ఓ ఆసక్తికర కామెంట్​ చేశారు.

"సమంత గొప్ప హార్డ్‌వర్కర్‌. చేసే పనిలో 100 శాతం డెడికేషన్​ చూపిస్తుంది. భిన్న పరిస్థితులు ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. ఏదైనా నిశ్చయించుకుంటే కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తుంది. 'మజిలీ' తర్వాత సామ్‌ నటించిన 'ఫ్యామిలీమ్యాన్‌', 'ఓ బేబీ' సినిమాలు నాకెంతగానో నచ్చాయి. రీసెంట్​గా ఆమె నటించిన సినిమా 'యశోద' కూడా చూశాను." అని చైతు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.