ETV Bharat / entertainment

ఆ హీరోలకు నేను వీరాభిమానిని.. నాపై ఆయన ప్రభావం ఉంది: యశ్​

author img

By

Published : Nov 7, 2022, 2:23 PM IST

కేజీయఫ్​ ఫేమ్​ హీరో యశ్​ తన అభిమాన హీరోల పేర్లు తెలిపాడు. తనను ఏ హీరో ప్రభావితం చేశారో చెప్పాడు.

hero yash role model actors
ఆ హీరోలకు యశ్​ వీరాభిమాని

కేజీయఫ్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్‌. 'రాకీ భాయ్‌'గా సినీ ప్రియుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. ఎటువంటి బ్యాక్​గ్రౌండ్ లేకపోయినా పాన్​ ఇండియా స్టార్‌గా ఎదిగారు. మరి ఈ హీరోకు ఎవరు స్ఫూర్తినిచ్చారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

"నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే రాకీభాయ్‌ పాత్ర నాది అని నేను చెప్పలేను.. ఎందుకంటే నేను చూసిన ఏ సినిమా అయినా నన్ను బాగా ప్రభావితం చేస్తుంది. నేను ఓ విలేకరి పాత్రలో నటించాల్సి వస్తే.. వాళ్ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. వాళ్ల హావభావాలు, బాడీ లాంగ్వేజీ అన్ని గమనిస్తాను. నా విషయానికొస్తే నాకు చాలామంది రోల్‌మోడల్స్‌ ఉన్నారు. శంకర్‌ నాగ్‌, అంబరీష్‌, రాజ్‌కుమార్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌.. ఇలా చాలామంది నటులకు నేను వీరాభిమానిని. వీళ్లందరిలో రజనీకాంత్‌ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన నన్ను ఎంతో ప్రభావితం చేశారు" అని తెలిపాడు యశ్‌.

ఈ కేజీయఫ్‌ స్టార్‌ తనకు ఇష్టమైన హీరోలపై ఉన్న అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ ఉంటాడు. కేజీయఫ్‌-2 సినిమాకు ముందు యశ్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘కమల్‌ హాసన్‌ నటన భగవద్గీత, రజనీకాంత్‌ సర్‌ నాకు దేవుడు.. ఆయన మా తలైవా" అని చెప్పిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి: కమల్​కు తొలి సినిమాకే అంత ఎక్కువ రెమ్యునరేషనా.. అది కూడా ఆ రోజుల్లో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.