ETV Bharat / entertainment

శర్వా పెళ్లి ఖర్చు.. ఒక్క రోజుకు అన్ని కోట్లా? - శర్వానంద్​ పెళ్లి ఖర్చు ఒక్క రోజు 4 కోట్లు

హీరో శర్వానంద్​.. తన పెళ్లి కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేయనున్నారో సమాచారం అందింది. ఆ వివరాలు..

Sharwanand
శర్వా పెళ్లి ఖర్చు.. ఒక్క రోజుకు అన్ని కోట్లా?
author img

By

Published : May 21, 2023, 7:15 PM IST

టాలీవుడ్‌ హీరో శర్వానంద్​ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాడు! రక్షితా రెడ్డి అనే యువతి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. రీసెంట్​గా తమ పెళ్లి తేదీ కూడా ప్రకటించారు. జూన్‌ 2,3 తేదీల్లో పెళ్లి జరగనున్నట్లు పేర్కొన్నారు. 2వ తేదీన మెహందీ, సంగీత్‌ ఫంక్షన్‌ నిర్వహించనుండగా.. 3వ తేదీన శర్వా-రక్షితా పెళ్లి చేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదిక కానుంది. ఈ ప్యాలెస్‌లో పెళ్లి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే సోషల్‌ మీడియా సహా పలు వెబ్​సైట్ల కథనం ప్రకారం.. సదరు ప్యాలెస్‌లో ఒక్క రోజుకు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. మొత్తంగా ఈ రెండు రోజలు పెళ్లికి అన్ని ఖర్చులతో కలిపి రూ.10కోట్లు అవ్వనుందట.

ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా.. ఇక ఈ విషయం తెలిసిన శర్వానంద్​ ఫ్యాన్స్‌.. సెలబ్రిటీలంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది అని అంటున్నారు. జీవితంలో ఒక్కసారే వచ్చే పెళ్లికి సెలబ్రిటీలు ఆ మాత్రం ఖర్చుపెట్టకపోతే ఎలా అని మాట్లాడుకుంటున్నారు. కాగా, గ్రాండ్​గా జరగనున్న ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు అతిథులుగా విచ్చేయనున్నట్లు సమాచారం. మెగాదంపతులు​ రామ్​చరణ్​ ఉపాసన దంపతులు వచ్చే అవకాశం కూడా ఉంది.

శర్వానంద్ సినిమాలు.. శర్వానంద్‌ చివరి సారిగా 'ఒకే ఒక జీవితం' సినిమాలో నటించారు. అది బాక్సాఫీస్ వద్ద యావరేజ్​గా నిలిచింది. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్​లో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ హృదయం ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దీంతో పాటే మాస్​మహారాజా రవితేజతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారని సమాచారం. ఇందులో లెక్చరర్​గా రవితేజ, ఆయన స్టూడెంట్​గా శర్వానంద్ కనిపిస్తారని టాక్. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తారట.

రక్షిత ఎవరంటే?.. హీరో శర్వానంద్​తో జీవితం పంచుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం ఆమె ఫారెన్​లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారట. ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. అంతే కాదు... ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనమరాలు కూడా!

ఇదీ చూడండి : Bichagadu 2 Collections : జోరు మీదున్న 'బిచ్చగాడు 2'.. రెండో రోజు అదిరిపోయే వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.