ETV Bharat / entertainment

Harihara Veeramallu Release Date : పవన్ ఫ్యాన్స్​కు సూపర్​ న్యూస్​.. 'వీరమల్లు' రాక అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత - హరిహర వీరమల్లు షూటింగ్​ అప్డేట్​

Harihara Veeramallu Release Date : క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్​, విడుదలై క్లారిటీ ఇచ్చారు నిర్మాత ఏఎమ్‌ రత్నం. ఆ వివరాలు..

Harihara Veeramallu Movie : పవన్ ఫ్యాన్స్​కు సూపర్​ న్యూస్​.. 'వీరమల్లు' వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 5:00 PM IST

Harihara Veeramallu Release Date : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులంతా ఫుల్‌ ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్​ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఆయన అప్‌కమింగ్‌ చిత్రాల అప్డేట్స్​ ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించాయి. అయితే తాజాగా అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు నిర్మాత ఏఎమ్‌ రత్నం. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ కీలక అప్డేట్​ను ఇచ్చారాయన.

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం 'రూల్స్‌ రంజన్‌'. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్​కు రెడీ అయింది. ఈ సందర్భంగా మూవీటీమ్​ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎమ్‌ రత్నం పాల్గొన్నారు. ఇందులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 'హరిహర వీరమల్లు' విడుదల గురించి కూడా మాట్లాడారు.

Harihara Veeramallu Shooting Update : "ఇది పిరియాడికల్‌ మూవీ. చాలా పెద్ద సినిమా ఇది. అన్నీ చిత్రాల కన్నా భిన్నంగా ఉంటుంది. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అలాగే, పవన్‌ కల్యాణ్ కూడా పొలిటికల్​గా చాలా బిజీగా ఉన్నారు. అందుకే తక్కువ రోజుల్లో పూర్తయ్యే రీమిక్స్‌, చిన్న సినిమాలను చేస్తున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్​ను ఈ ఏడాది చివరి నాటికి కంప్లీట్ చేస్తాం. వచ్చే ఏడాది ఎలెక్షన్స్​ కన్నా ముందే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం" అని పేర్కొన్నారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ గ్రాండ్​గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు దాటేసింది. కానీ ఇప్పటికీ వరకు పూర్తి కాలేదు. ఆలస్యమవుతూనే వస్తోంది. దీనిపైనే క్రిష్ కసర్తత్తులు చేస్తూనే ఉన్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా గురించి ఆలోచించి ఆలోచించి విసిపోయారు కూడా. కానీ రీసెంట్​గా పవన్​ పుట్టినరోజుకు ఓ మోషన్ పోస్టర్​ను రిలీజ్​ చేసి ఫ్యాన్స్​ను సంతోషపెట్టడానికి ట్రై చేశారు మేకర్స్​. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏఎమ్‌ రత్నం మాత్రం అదిరిపోయే అప్డేట్​ చెప్పి ఖుషి చేశారు.

Pawan kalyan Birthday Wishes : 'వీరమల్లు' సర్​ప్రైజ్​.. హమ్మయ్యా.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్​ హైలైట్

హరిహరా.. వీరమల్లు ఎక్కడ..?

హరిహర వీరమల్లు షూటింగ్​ సెట్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.