అగ్ర కథానాయకుడి తమ్ముడిగా ప్రస్థానం మొదలు పెట్టి.. అంచెలంచెలుగా అశేష అభిమానుల ఆదరణ పొందిన మేటి నటుడు పవన్ కల్యాణ్. అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చినా.. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల కళ్లలో పడ్డారు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో యువతను ఉర్రూతలూగించారు. మధ్యలో కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద అంత ప్రభావం చూపకపోయినప్పటికీ.. ఆ క్రేజ్‌ను అలాగే ఒక దశాబ్దం పాటు కొనసాగించడం పవన్ కల్యాణ్‌కే చెల్లింది అంటే అతిశయోక్తి కాదు.
ఆయన ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే సందేశం ఉంటుంది. యువతను చైతన్యపరిచే విధంగా హావభావాలు ప్రదర్శస్తాయి ఆయన పాత్రలు. ఈ కారణాలే తెలుగులో ఆయనను అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలబెట్టాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన స్టార్ ఇమేజ్‌తో ప్రేక్షకుల మనుసు దోచుకున్నారు పవర్ స్టార్. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్నారు.
పవర్‌స్టార్ సినిమాల కోసం అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎదురుచూపులకు ఇక తెర పడనుంది. ఇప్పుడు పవర్ స్టార్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'హరి హర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్', సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్నాయి.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'హరి హర వీరమల్లు'. హిస్టారికల్ చిత్రంగా 'హరి హర వీరమల్లు' సిద్ధమవుతోంది. మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో సాగే కథ ఇది. చరిత్రకెక్కిన ఒక బందిపోటు వీరోచిత గాథగా దీన్ని రూపొందిస్తున్నారు. రాధా కృష్ణ జాగర్లమూడి (క్రిష్)దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీనికోసమే చిత్ర బృందం ప్రధాన నటీనటులు, కొంత మంది సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా ఓ ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది. ఇది శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్‌తో పాటు సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, క్రిష్, ఎం.ఎం.కీరవాణి తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోలో పవన్ స్క్రిప్ట్ విషయమై దర్శకుడు, ఇతర ప్రధాన తారాగణంతో చర్చించడం కనిపించింది.
అయితే ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. వర్క్‌షాప్ ముగిశాక అక్టోబర్ రెండో వారం తర్వాత నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రహణం: వి.ఎస్.జ్ఞానశేఖర్.
సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా 'హరి హర వీరమల్లు' 'పవర్ గ్లాన్స్..' ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. అదే రోజు పవర్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన జల్సా చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. ఆ రీరిలీజ్‌కు కూడా అభిమానులు భారీ సంఖ్యలు తరలివచ్చారు. కొత్త సినిమా విడుదలను మించిపోయింది జల్సా రీరిలీజ్. మాస్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవధీయుడు భగత్ సింగ్'లో నటిస్తున్నారు. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది.
ఇవీ చదవండి: 'పుష్ప' విలన్ కొత్త సినిమా.. సత్యదేవ్ మల్టీ స్టారర్.. న్యూ లుక్‌లో మమ్ముట్టి
రాజమౌళి గొప్ప దర్శకుడే.. కానీ ఆయనతో సినిమా చేయాలని లేదు: మెగాస్టార్