Hanuman Pre Release Business : యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్'. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో జనవరి 12న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియా, ఓవర్సీస్లో బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా ఏయే ప్రాంతంలో ఎంత వసూలు చేసిందంటే ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ డిస్ట్రీబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. ఇక నైజాం థియేట్రికల్ రైట్స్‌కు 7.5 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. అలా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు రూ. 21.5 కోట్ల మేర అమ్ముడయ్యాయని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ లభించిందట. ఇందులో భాగంగా ఈ చిత్ర హక్కులు రూ. 2 కోట్ల మేర అమ్ముడుపోయాయని టాక్ నడుస్తోంది. ఇక ఓవర్సీస్ రైట్స్ కూడా రూ. 4 కోట్ల మేర బిజినెస్ జరిగిందని సమాచారం. దీంతో ఇప్పటి వరకు హనుమాన్ సినిమా రూ. 27.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. దీంతో లాభాల్లోకి రావాలంటే ఈ చిత్రం సుమారు రూ. 28.5 కోట్లు వసూలు చేయాలని విశ్లేషకుల మాట.
Hanuman Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే - ఇందులో తేజ సజ్జాతో పాటు అషీక రంగనాథ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు 11 భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. సుమారు 2 గంటల 38 నిమిషాలు రన్ టైమ్ గల ఈ సినిమాలో యాక్షన్ అంశాలు భారీగానే ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హనుమాన్' కోసం 'అంజనాద్రి' - ఈ సినిమాలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయంటే ?
'హనుమాన్' ప్రీమియర్ షోస్ టికెట్స్ - ఊహించని విధంగా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!