Hanuman Movie TFPC Press Note: హనుమాన్ సినిమా థియేటర్ల విషయంలో మొదటి నుంచే పలు సమస్యలు తలెత్తున్నాయి. జనవరి 12న రిలీజైన సినిమా హిట్ టాక్ అందుకున్నప్పటికీ ఈ థియేటర్ల క్లియర్ కాలేదు. అయితే నైజాంలో పలు థియేటర్ల యాజమాన్యం ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవట్లేదట. ఈ విషయామై ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీమేకర్స్, హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మాత సంఘానికి ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన నిర్మాతల సంఘం ఈ విషయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రమాదమని తెలిపింది. ఈ మేరకు టీఎఫ్‌పీసీ అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. 'మైత్రి మూవీమేకర్స్ జనవరి 12నుంచి హనుమాన్ సినిమా ప్రదర్శన కోసం తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ పలు థియేటర్ల యాజమానులు ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేస్తూ నైజాం ఏరియాల్లో సినిమా ప్రదర్శించలేదు. దీనివల్ల చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అపార నష్టం వాటిల్లింది.ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయా థియేటర్లలో వెంటనే హనుమాన్ సినిమాను ప్రదర్శించాలి. థియేటర్ల వారి ఇలాంటి చర్యలు చిత్ర పరిశ్రమ మనుగడకు ప్రమాదం. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తూ హనుమాన్కు సత్వర న్యాయం చేయాలని తెలుగు చిత్ర నిర్మాతల మండలి కోరుతుంది' అని ప్రెస్ నోట్లో పేర్కొంది.
-
Telugu Film Producer Council Press Note to Support #Hanuman against Nizam Monopoly pic.twitter.com/C7vW1kXPoG
— Milagro Movies (@MilagroMovies) January 13, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Telugu Film Producer Council Press Note to Support #Hanuman against Nizam Monopoly pic.twitter.com/C7vW1kXPoG
— Milagro Movies (@MilagroMovies) January 13, 2024Telugu Film Producer Council Press Note to Support #Hanuman against Nizam Monopoly pic.twitter.com/C7vW1kXPoG
— Milagro Movies (@MilagroMovies) January 13, 2024
Hanuman Day 1 Collection: జనవరి 12న రిలీజైన హనుమాన్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు ఉన్న స్క్రీన్స్ తక్కువే అయినప్పటికీ, జెట్ స్పీడ్‌తో టికెట్లు అమ్ముడవుతున్నాయి. తొలి రోజు హనుమాన్ వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.20 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
Hanuman Cast: ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్స్‌లో నటించగా, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, దీపక్ శెట్టి ఆయా పాత్రలు పోషించారు. ఇక ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హనుమాన్' ర్యాంపేజ్ - ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
'హనుమాన్' ఓటీటీ రైట్స్ డీటెయిల్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?