Hanuman Movie : 'జాంబిరెడ్డి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు యంగ్ స్టార్ తేజ సజ్జ. ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా.. ఆడియెన్స్ నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. తేజ ప్రస్తుతం.. తన మూడో సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మతో జతకట్టాడు. వీరిద్దరి కాంబోలో 'హనుమాన్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అయితే వినాయక చవితి సందర్భంగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మూవీమేకర్స్. అందులో సంక్రాంతి రిలీజ్ (జనవరి 12) అని మెన్షన్ చేశారు. సాధారణంగా సంక్రాంతి మూడు రోజులు టాలీవుడ్లో సినిమాలకు పెద్ద రిలీజ్ డేట్లు. తెలుగు అగ్ర కథానాయకులు సంక్రాతి టైమ్‌లోనే బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుంటారు.
ఈ క్రమంలో 'హనుమాన్' సినిమా విడుదల తేదీని.. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' చిత్రబృందం ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా కూడా జనవరి 12న రానున్నట్లు మూవీమేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో తేజసజ్జ.. ఏకంగా మహేశ్ బాబు సినిమాకే ఎదురు వెళ్లేంత దైర్యం చేశాడా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక మరోవైపు 'గుంటూరు కారం' సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయేమో.. అందుకనే 'హనుమాన్' మూవీ టీమ్ ఆ పెద్ద డేట్‌ను లాక్ చేసుకొని ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. సినిమాలో ఎక్కువగా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) ఉపయోగిస్తున్నారు. అయితే సినిమా చిన్న ప్రాజెక్టే అయినప్పటికీ.. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఊహించని రీతిలో స్పందన లభించింది. ఈ టీజర్ దేశవ్యాప్తంగా మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంది. దీంతో సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
అందుకు తగ్గట్లు ప్రమోషన్స్ చేయడానికి కూడా మూవీ యూనిట్‌కు కావాల్సినంత సమయం కూడా ఉంది. సినిమాలో నటి అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. ఇక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పక్కా రూట్ మ్యాప్‌తో 'హనుమాన్' తేజ కెరీర్ ప్లాన్.. ప్రూఫ్ ఇదే!