Hanuman Movie Hindi Promotions : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వస్తున్న సినిమా 'హనుమాన్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు మరో అరడజను వరకు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అందులో మహేశ్ బాబు, రవితేజ వంటి అగ్ర నటుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియోటర్ల విషయంలో హనుమాన్కు ఇబ్బందులు తలెత్తాయి. మహేశ్ మూవీకి 90 శాతం థియేటర్లకు దక్కగా ఈ సినిమాకు కేవలం 10శాతమే దొరికాయని సినీవర్గాల టాక్. ఇదే జరిగితే 'హనుమాన్' కలెక్షన్లకు నష్టం జరుగుతుంది.
11 భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో 'హనుమాన్' విడుదలవుతోంది. ఈ క్రమంలో తెలుగులో థియేటర్లు దక్కకున్నా, హిందీ ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తారని చిత్రం బృందం అంచనా వేసుకుంది. ఇలాంటి కథాంశాలతో వచ్చిన సినిమాలు కూడా నార్త్‌లో మంచి విజయం సాధించాయి. కానీ ఇప్పుడు హిందీలో తాము ప్రమోషన్స్ చేయడం లేదని కథానాయకుడు తేజ సజ్జ తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన తేజ, కేవలం రెండు ప్రెస్మీట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి కారణాలు కూడా వివరించారు.
'ముంబయిలో మేము ఎవరికీ తెలియదు. నేను ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మాల్కి వెళ్లి ఏం చేస్తా? చాలా మంది ముంబయిలో ఏదైనా కాలేజీకి వెళ్లి, గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని సలహా ఇస్తున్నారు. కానీ నేను అక్కడికి వెళ్లి ఏం చేయాలి? నేను అక్కడ ఎవరికీ తెలియదు. 'మౌత్ టాక్' వల్ల సినిమా హిట్ అయితే అదే సంతోషం. ఒక వేళ మూవీ విజయం సాధించినా మేము అక్కడికి వెళ్లే అవసరం లేదు' అని తేజ వివరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హిందీలో 'హనుమాన్'- ట్రెండ్ రిపీట్ అవతుందా?
కృష్ణుడు, ద్వారక నేపథ్యంలో వచ్చిన 'కార్తికేయ-2' హిందీలో మొదటి రోజు రూ.7 లక్షలు మాత్రమే సాధించింది. కానీ మౌత్ టాక్ వల్ల క్రమంగా కేవలం హిందీలోనే రూ.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే కన్నడ మూవీ 'కాంతార' తొలి రోజు రూ.2.5 మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత క్రమంగా హిందీలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ సీన్ రివర్స్ అయింది.
ఇప్పుడు నార్త్‌లో ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న ప్రశాంత్ వర్మ 'హనుమాన్'తో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విఎఫ్ఎక్స్ విలువలపై కూడా అభిమానులు సంతృప్తికరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో హిందీలో హనుమాన్ విజయ ఢంకా మోగించడం ఖాయమే అయినా ఏదైనా తేడా వస్తే పరిస్థితులు తలకిందులవుతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">