Guntur Karam Worldwide Collection: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమాతో ఆల్‌టైమ్ రికార్డు కొట్టారు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీ తొలి వారంలో రూ.212 మొత్తం కోట్లు వసూల్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఓ రీజినల్ (ప్రాంతీయ భాషలో) ఫిల్మ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. కాగా, మహేశ్ కెరీర్లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి.
-
Ramanagadi Mania in full swing 😎 Shattering records on a blazing note 🔥 #GunturKaaram storms into history, setting an ALL-TIME REGIONAL FILM RECORD with 2️⃣1️⃣2️⃣Cr+ in its First Week ❤️🔥#BlockbusterGunturKaaram 🌶️
— Guntur Kaaram (@GunturKaaram) January 19, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Super 🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14… pic.twitter.com/mWlaNoLD5A
">Ramanagadi Mania in full swing 😎 Shattering records on a blazing note 🔥 #GunturKaaram storms into history, setting an ALL-TIME REGIONAL FILM RECORD with 2️⃣1️⃣2️⃣Cr+ in its First Week ❤️🔥#BlockbusterGunturKaaram 🌶️
— Guntur Kaaram (@GunturKaaram) January 19, 2024
Super 🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14… pic.twitter.com/mWlaNoLD5ARamanagadi Mania in full swing 😎 Shattering records on a blazing note 🔥 #GunturKaaram storms into history, setting an ALL-TIME REGIONAL FILM RECORD with 2️⃣1️⃣2️⃣Cr+ in its First Week ❤️🔥#BlockbusterGunturKaaram 🌶️
— Guntur Kaaram (@GunturKaaram) January 19, 2024
Super 🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14… pic.twitter.com/mWlaNoLD5A
5Th Rs.100+ Share Film For Mahesh Babu:ఇక మహేశ్‌బాబు కెరీర్లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సినిమాతో రికార్డు కొట్టారు. ఇదివరకు 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు మహేశ్.
మాటల మాంత్రికుడు శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేశ్‌తో సినిమా తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా మంచి సక్సెస్ సాధించాయి. ఇక తాజా గుంటూరు కారం సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మహేశ్‌బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. త్వరలోనే మూవీటీమ్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Guntur Kaaram Cast:ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా, మీనాక్షి చౌదరి కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందట. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">