ETV Bharat / entertainment

బాబు ఊర మాస్​ - ఇరగదీసిన శ్రీలీల - 'కుర్చీ మడతబెట్టి' సాంగ్​తో ఫ్యాన్స్​కు కిక్కే కిక్కు! - Kurchi Madatha Petti

Guntur Karam Kurchi Madatha Petti Song : మహేశ్​ బాబు శ్రీలీల లీడ్ రోల్స్​లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా మూడో సాంగ్​ విడుదలైంది. కుర్చీ మడతబెట్టి అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్​ను షేక్ చేస్తోంది. ఆ విశేషాలు మీ కోసం

Guntur Karam Kurchi Madatha Petti Song
Guntur Karam Kurchi Madatha Petti Song
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 4:51 PM IST

Updated : Dec 30, 2023, 7:57 PM IST

Guntur Karam Kurchi Madatha Petti Song : మహేశ్​ బాబు శ్రీలీల మాస్​ మూడ్​లోకి దిగారు. 'గంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతబెట్టే' అనే సాంగ్​కు ఈ ఇద్దరూ ఇరగదీసే స్టెప్పులేశారు. ఇటీవలే వచ్చిన ప్రోమోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్​ రాగా, తాజాగా విడుదలైన లిరికల్​ సాంగ్​ ప్రస్తుతం ఇంటర్నెట్​ను షేక్​ చేస్తోంది. తమన్​ మ్యూజిక్​తో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, శేఖర్ మాస్టర్​ ఇలా సాంగ్​లోని అన్ని స్టెప్స్​ బాగున్నాయని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఈ సాంగ్​ను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాష్​ట్యాగులు క్రియేట్​ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్సే వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్​, శ్రీలీలతో పాటు మీనాక్షీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ స్టార్స్​ జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, సునీల్, ప్రకాశ్ రాజ్, రఘబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్​పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భారీ బడ్జెట్​తో పాటు అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

మరోవైపు వచ్చే ఏడాది జనవరి 6న హైదరాబాద్​లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్​ పనులు పూర్తి చేసుకుని 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఆడియెన్స్​ను అలరించేందుకు విడుదల కానుంది.

ఇక గుంటూరు కారం సినిమాలో హీరోయిన్​ శ్రీలీలను ఇంప్రెస్ చేయడానికి మహేశ్ బాబు తన సూపర్ హిట్ మూవీ ఒక్కడు నుంచి చెప్పవే చిరుగాలి పాటను పాడారట. అయితే మొత్తం సాంగ్ కాదని, కేవలం ఫస్ట్ రెండు లైన్లను మహేశ్ తన స్టైల్​లో పాడినట్లు సమాచారం. ఈ సీన్​ను అభిమానులను తెగ ఆకట్టుకుంటుందట. త్రివిక్రమ్ కూడా సరైన మసాలా డోస్ ఇచ్చేలా ఆ సీన్ ను చిత్రీకరించారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఘాటెక్కిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సాంగ్​ - 'దమ్‌ మసాలా బిర్యానీలా'

'ఓ మై బేబీ' సాంగ్ ఔట్- రిపీటెడ్ మోడ్​లో క్రేజీ మెలోడీ!

Last Updated : Dec 30, 2023, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.