Guntur Karam Hanuman Clash: 2024 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 సినిమాలు పోటీ పడుతుండడం విశేషం. అందులోనూ జనవరి 12న 'గుంటూరు కారం', 'హనుమాన్' ఏకంగా రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే మొదట్లో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకుంటారేమో అనుకున్నారంతా. కానీ, ఎవరూ తగ్గేదేలే అనడం వల్ల కొన్ని రోజులుగా వీటి గురించే చర్చ నడుస్తోంది.
అయితే తాజాగా ఓ ట్వీట్ మరింత ఆసక్తిగా మారింది. 2000 సంవత్సరంలో రిలీజైన మహేశ్‌బాబు 'యువరాజు' సినిమాలో, 'హనుమాన్' హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. యువరాజు సినిమాలో తేజ సజ్జ, మహేశ్‌బాబు కుమారుడి పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు ఏకంగా 2024 సంక్రాంతికి మహేశ్ సినిమాకు పోటీగా వస్తున్నాడంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలైంది. దానికి తేజ స్పందిస్తూ, 'సూపర్‌స్టార్‌తో పోటీ ఏంటి సర్. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా' అని ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు.
-
#SuperStar tho poti enti sir 🤦♂️🙏
— Teja Sajja (@tejasajja123) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
అయన తో పోటీగ కాదు సర్
అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8
">#SuperStar tho poti enti sir 🤦♂️🙏
— Teja Sajja (@tejasajja123) January 2, 2024
అయన తో పోటీగ కాదు సర్
అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8#SuperStar tho poti enti sir 🤦♂️🙏
— Teja Sajja (@tejasajja123) January 2, 2024
అయన తో పోటీగ కాదు సర్
అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8
-
Funny clip of @tejasajja123 and @urstrulyMahesh from #YuvaRaju, which was released in the year 2000.pic.twitter.com/V4Q2FvscKR
— Movies4u Official (@Movies4u_Officl) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Funny clip of @tejasajja123 and @urstrulyMahesh from #YuvaRaju, which was released in the year 2000.pic.twitter.com/V4Q2FvscKR
— Movies4u Official (@Movies4u_Officl) January 2, 2024Funny clip of @tejasajja123 and @urstrulyMahesh from #YuvaRaju, which was released in the year 2000.pic.twitter.com/V4Q2FvscKR
— Movies4u Official (@Movies4u_Officl) January 2, 2024
Hanuman Movie: తేజ సజ్జ లీడ్ రోల్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను 11 భాషల్లో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లో చూపించి హై క్వాలిటీ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కు ఇప్పటికే విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, వినయ్ రాయ్, దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Guntur Karam: మహేశ్‌బాబు- శ్రీలీల జంటగా తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరీ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. 'ఓ మై బేబీ', 'కుర్చి మడతబెట్టి' సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇక త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
'ఆదిపురుష్' తరహాలో 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్- చీఫ్ గెస్ట్లుగా ప్రభాస్, బాలకృష్ణ!
మహేశ్ బాబు న్యూఇయర్ విషెష్- స్పెషల్ ఫొటో షేర్ చేసిన సూపర్‌స్టార్