ETV Bharat / entertainment

ఫుల్​ స్వింగ్​లో 'గుంటూరు కారం' ఓవర్సీస్​ బుకింగ్స్​ - ఎన్ని కోట్లు కలెక్ట్ అయ్యాయంటే? - Guntur Kaaram Premiers

Guntur Kaaram Overseas Advance Bookings : గుంటూరు కారం సినిమాకు ఓవర్సీస్​లో మంచి డిమాండ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్​ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయంటే?

ఫుల్​ స్వింగ్​లో 'గుంటూరు కారం' ఓవర్సీస్​ బుకింగ్స్​ - మహేశ్​ను బీట్​ చేయడం కష్టమే!  ​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 11:48 AM IST

Guntur Kaaram Overseas Advance Bookings : సూపర్ స్టార్​ మహేశ్​ బాబు నటించిన ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​ 'గుంటూరు కారం' మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే మహేశ్​ సినిమాలకు ఓవర్సీస్​లోనూ మంచి మార్కెట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గుంటూరు చిత్రం కూడా ఓవర్సీస్​లో రికార్డ్​ రేంజ్​లో అడ్వాన్స్ బుకింగ్స్​ను జరుపుకుంటోంది.

ఓవర్సీస్​లో ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ.10కోట్లకు పైగా వచ్చేలా ఉన్నాయని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్(Guntur Kaaram Premiers)​ కోసం అడ్వాన్స్ బుక్సింగ్స్​ 1 మిలియన్ మార్క్​ను దాటినట్లు పేర్కొన్నాయి. ఇక జనవరి 9న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​కు వచ్చిన హైప్​తో ఈ రెండు రోజుల్లో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్​ అడ్వాన్స్ బుక్సింగ్స్ 1.5 నుంచి 1.7 మిలియన్​ మార్క్​ క్రాస్​ చేసేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఓపెనింగ్ డే అడ్వాన్స్ బుకింగ్స్​ కూడా ఎక్సెలెంట్​గా ఉన్నాయని, ఇప్పటికే 200కే దాటినట్లు తెలిసింది. ఇక ప్రీమియర్​ షోస్​ టాక్ పాజిటివ్​గా ఉంటే నార్త్​ అమెరికాలో ఓపెనింగ్​ డే బుకింగ్స్​ 2.5 మిలియన్​ మార్క్​ చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

నార్త్ అమెరికాలోనే కాదు ఇతర దేశాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్​ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. యూకేలో 16వేలకు పైగా టికెట్లు, ఆస్ట్రేలియాలో 100Kకు పైగా అడ్వాన్స్​ బుకింగ్స్​ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇక ఓవర్సీస్​ అంతటా పాజిటివ్ మౌత్​ టాక్​ వస్తే ఈ సినిమా కచ్చితంగా 3.25 మిలియన్​కు పైగా కలెక్షన్లను రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇకపోతే సినిమాలో మహేశ్ సరసన టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరీ మరో హీరోయిన్​. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. హారిక అండ్ హాసిని బ్యానర్‌ నిర్మించింది. సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా సినిమా రిలీజ్ కాబోతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సలార్, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్స్​ను బ్రేక్​ చేసిన గుంటూరు కారం

'ఇకపై మీరే నాకు అమ్మానాన్న'- 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేదికపై మహేశ్‌ ఎమోషనల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.