ETV Bharat / entertainment

'ఓ మై బేబీ' సాంగ్ ఔట్- రిపీటెడ్ మోడ్​లో క్రేజీ మెలోడీ! - Guntur Kaaram release date

Guntur Kaaram Oh My Baby Song : సూపర్​స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కుతున్న 'గుంటూర్ కారం' నుంచి ఓ మై బేబీ సాంగ్ రిలీజైంది. మీరు చూశారా?

Guntur Kaaram Oh My Baby Song
Guntur Kaaram Oh My Baby Song
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 6:26 PM IST

Updated : Dec 13, 2023, 6:53 PM IST

Guntur Kaaram Oh My Baby Song : సూపర్​స్టార్ మహేశ్ బాబు - శ్రీలీల లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' నుంచి రెండో సాంగ్ రిలీజైంది. 'ఓ మై బేబీ' అనే లిరికల్ మెలోడీ సాంగ్ యూట్యూబ్​లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక రామజోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించారు. శిల్పా రావు తన స్వరాన్ని అందించారు. ఇక ఈ పాట ప్రోమో వీడియో సోమవారం (డిసెంబర్ 11) విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతనెల డైరెక్టర్ త్రివిక్రమ్ బర్త్​ డే సంగర్భంగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్​ను రిలీజ్ చేసింది మూవీయూనిట్. 'దమ్ మసాలా బిర్యానీ' అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా సంజిత్‌ హెగ్డే, తమన్‌ పాడారు. ఎర్రకారం అరకోడి, నిమ్మసోడా ఫుల్ బీడీ, గుద్ది పారెయ్ గుంటూర్​ని అనే లిరిక్స్ ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో హీరో మహేశ్​ను మాస్​ లుక్​లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ ఆయన స్టైల్​కు ఫిగా అయ్యారు.​ పాట రిలీజైన తొలి రోజుల్లో యూట్యూబ్​లో ట్రెండింగ్ నెం.1గా నిలిచింది ఈ దమ్ మసాలా బిర్యానీ. మ్యూజిక్ సంచలనం ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మహేశ్ - తమన్ కాంబోలో ఇప్పటికే 'దూకుడు', 'బిజినెస్​మేన్', 'ఆగడు' సినిమా సాంగ్స్ సూపర్​హిట్​గా నిలిచాయి.

Guntur Kaaram Cast : ఈ సినిమాలో శ్రీలీలతోపాటు నటి మీనాక్షి చౌదరీ కీలక పాత్ర పోషిస్తోంది. సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, ముకేష్ రిషీ, రఘు బాబు, ఆశీష్ విద్యార్థి తదితరులు నటిస్తున్నారు. హారిక అండ్ హసిన్ క్రియేషన్స్​ బ్యానర్​పై యస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్ పనులు స్పీడ్​గా పూర్తిచేసి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మూవీటీమ్ ప్రయత్నాలు చేస్తోంది..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఘాటెక్కిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సాంగ్​ - 'దమ్‌ మసాలా బిర్యానీలా'

జోరు తగ్గించిన శ్రీలీల - ఆ ఇద్దరిలో ఈ యంగ్ బ్యూటీకి ఎవరు బ్రేక్ ఇస్తారో?

Last Updated : Dec 13, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.