టాలీవుడ్‌లో హాసినిగా అందరి మనసులు దోచేసింది జెనీలియా. ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ క్యూట్ హీరోయిన్ మరాఠాలో తన భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి నటించిన సినిమా వేద్. తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయిన మజిలీకు(నాగచైతన్య-సమంత) రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా మరాఠాలో మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.44.92కోట్ల వసూళ్లను అందుకున్నట్లు సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు.
కాగా, బాలీవుడ్ నటుడిగా రితేశ్ దేశ్‌ముఖ్ అందరికీ సుపరిచితుడే. 'వేద్'తో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. అంతేకాదు, ఈ చిత్రంతోనే పదేళ్ల తర్వాత జెనీలియా మళ్లీ వెండితెరపై మెరిశారు. కేవలం రూ.15కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగులో నాగచైతన్య పాత్రను రితేశ్, సమంత పాత్రను జెనీలియా పోషించారు. నూతన సంవత్సర కానుకగా డిసెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలిరోజు ఏకంగా రూ.3.5కోట్లు (గ్రాస్) వసూలు చేయగా, 15రోజుల్లో రూ.44.92కోట్లు రాబట్టింది. మరాఠా బ్లాక్ బస్టర్ సైరాట్ (రూ.110 కోట్లు) తర్వాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వేద్ నిలిచింది. ఈ సందర్భంగా జెనీలియా మాట్లాడుతూ.. "పదేళ్ల విరామంలో గృహిణిగా పిల్లలు, భర్తతో కలిసి జీవితంలో ఎన్నో ఇతర విషయాలు, పనులు చేయడానికి అవకాశం లభించింది. ఇప్పటివరకూ నా లైఫ్‌లో నేనేదీ ప్లాన్ చేసుకుని వెళ్లలేదు. ఇందులో నాది ఒక గృహిణి పాత్రే. అందుకే సహజంగా వచ్చిందేమో. ఒకవేళ రితేశ్ లేకపోతే, ఆ పాత్ర చేయడానికి మరింత సమయం పట్టేది. 'నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయడానికి ఇదే సరైన సమయం' అని రితేశ్ నన్ను ప్రోత్సహించాడు" అని జెనీలియా చెప్పుకొచ్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఎన్టీఆర్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి.. అయ్యో ఇలా అయిపోయిందేంటి