Game Changer Leaked Song : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయితే ఈ చిత్రానికి మొదట్లో లీక్‌ల సెగ తగిలిన విషయమే. ఇప్పుడు మళ్లీ తాజాగా ఓ సాంగ్ లీక్ అయింది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే లీకైన సాంగ్ ఫైనల్ వెర్షన్ కాదని తెలిసింది. టెస్టింగ్ సాంగ్ మాత్రమేనంట. మెయిన్ సాంగ్‌ను స్టార్ సింగర్స్‌తో పాడించడంతో పాటు ఫైనల్ మిక్స్ ఇంకా చాలా పనులు ఉన్నాయని తెలుస్తోంది. సౌండ్ మిక్సింగ్ అయ్యాక పాట మరింత బావుంటుందని చెబుతున్నారు. ఇకపోతే ఈ లీక్ విషయంలో మేకర్స్ కూడా తగిన యాక్షన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఒరిజినల్ సాంగ్ ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ వచ్చేసింది.
మరోవైపు ఈ లీక్‌పై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే ఇలా చేయడం సరికాదని అంటున్నారు. దయచేసి షేర్ చేయడం ఆపండంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఈ సాంగ్ బాగా వైరల్ అయిపోయింది.
సాంగ్‌పై నెగటివ్ కామెంట్స్.. ఇకపోతే శంకర్ సినిమాల్లో పాటలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. పాటలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అద్భుతమైన లిరిక్స్ కళ్లు చెదిరి విజువల్స్‌తో తెరకెక్కిస్తారు. అయితే ఈ లీకైన పాట లిరిక్స్ బాగోలేదని కామెంట్లు వస్తున్నాయి. తమన్ బీట్ కూడా బాగోలేదని అంటున్నారు. చూడాలి మరి మూవీటీమ్ సాంగ్‌లో ఏమైనా మార్పులు చేస్తుందా అనేది..
ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నారు. మూవీలో చరణ్ డబుల్ రోల్లో కనిపిస్తారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. విలక్షణ నటుడు ఎస్.జే.సూర్య, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ తర్వాత ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
-
The leaked song is a very basic composing version of it. Please refain from spreading it and forming opinions based on it. The singers are also basic track singers and not final. A very inferior copy of the final copy.
— .... (@ynakg2) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The leaked song is a very basic composing version of it. Please refain from spreading it and forming opinions based on it. The singers are also basic track singers and not final. A very inferior copy of the final copy.
— .... (@ynakg2) September 15, 2023The leaked song is a very basic composing version of it. Please refain from spreading it and forming opinions based on it. The singers are also basic track singers and not final. A very inferior copy of the final copy.
— .... (@ynakg2) September 15, 2023
Pushpa 2 Gamechanger : 'పుష్ప 2' - 'గేమ్ ఛేంజర్'.. ఇక అప్పుడు కూడా డౌటే!
Dil Raju Game Changer Movie Update : అదేంటి.. ఆ విషయం దిల్ రాజుకు కూడా తెలియదా?