Adipurush Movie : మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'పై విమర్శల వెల్లువ ఇంకా కొనసాగుతూనే ఉంది. కంటెంట్, వీఎఫ్ఎక్స్, పాత్రల చిత్రీకరణ విషయంలో దర్శకుడు చేసిన తప్పిదాలను బయటకి తీసి నెట్టింట ఆడియన్స్ దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ కూడా ఇదే విషయం గురించి 'ఆదిపురుష్' మేకర్స్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. 'ఆదిపురుష్ విషయంలో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు' అంటూ ఆగ్రహానికి గురయ్యారు.
"ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. నిన్న రెండు షోలు క్యాన్సిల్ అవ్వగా.. బయట వస్తున్ననెగిటివిటీ వల్ల ఈ రోజు మ్యాట్నీని కూడా రద్దు చేయాల్సి వస్తోంది. ఇక అతి త్వరలో ఈ సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తారు. ఇలాంటి రోజు వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. మా థియేటర్ మాత్రమే కాదు.. ఈ సినిమా ఉన్న అన్ని థియేటర్ల యజమానులు ఇప్పటికే నష్టపోయారు. ఈ వ్యక్తులపై (ఆదిపురుష్ నిర్మాతలు) కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. సినిమా నిర్మాణంలో పాల్గొన్న వారందరూ, ముఖ్యంగా రచయిత మనోజ్ ముంతాషీర్ను జైలుకు పంపాలి." అని ఆయన ధ్వజమెత్తారు.
ఇక వివాదాస్పద డైలాగ్‌లను మేకర్స్ సవరించడంపై కూడా మనోజ్ మాట్లాడారు. "వారు డైలాగ్‌లలో కొన్ని మార్పులు చేసారు, కానీ చాలా ఆలస్యం అయింది. విడుదల తర్వాత సినిమాలో డైలాగ్‌లను మార్చడం అనేది సమంజసం కాదని నా అభిప్రాయం" అని ఆయన అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నేపాల్‌లో స్క్రీనింగ్స్ షురూ..
Adipurush Screenings : 'ఆదిపురుష్'లో సీతమ్మ జన్మస్థలంను భారత్ అని చూపించినందుకు మండిపడ్డ నేపాల్ ప్రభుత్వం.. ఆ సినిమాతో పాటు అన్నీ ఇండియన్ సినిమాల స్క్రీనింగ్‌ను రద్దు చేసింది. అయితే ఇప్పుడు ఆ నిషేదాన్ని ఎత్తివేసి.. శుక్రవారం నుంచి 'ఆదిపురుష్' తప్ప అన్ని సినిమాల స్క్రీనింగ్స్‌ను పునః ప్రారంభించింది. ఈ విషయాన్ని నేపాల్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
Adipurush Day 8 Collections : కలక్షన్ల విషయంలో ఆదిపురుష్ సినిమా క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. విడుదలైన 8వ రోజు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 3.25 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. థియేటర్లలో లో ఆక్యుపెన్సీ వల్ల పలు చోట్ల కొన్ని షోలు క్యాన్సిల్ అయ్యాయని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">