Farhan Akhtar Don 3 Announcement : సీనీ ప్రేక్షకులకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ గుడ్ న్యూస్ అందిచారు. ఇప్పటికే మెుదటి రెండు భాగాలతోదుమ్ము రేపిన 'డాన్' ఫ్రాంఛైజీ నుంచి 'డాన్-3' రాబోతున్నట్లు ప్రకటించారు! ఈ విషయాన్ని ఓ చిన్న టీజర్ ద్వారా సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించారు. అయితే 'డాన్-3' అని చెప్పకుండా కేవలం 3 నంబర్‌ను హైలైట్ చేస్తూ ఈ వీడియో ఉంది. ఇక క్యాప్షన్‌లో కూడా పూర్తి వివరాలు లేకుండా ఈ వీడియోను రిలీజ్ చేశారు.
అయితే ఆ టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు అది 'డాన్ 3'కు సంబంధించిన అప్డేట్ అనే విషయం అర్థమవుతుంది. డాన్ మూవీలోని పాపులర్ సాంగ్ 'మై హూ డాన్' మ్యూజిక్ లాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఇది డాన్ 3 సినిమా అప్డేట్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఫర్హాన్ సోదరి, డైరెక్టర్ జోయా అక్తర్ కూడా బూమ్ అనే కామెంట్‌తో స్పందించింది. ఈ వీడియోలో కింద 'కొత్త శకం ప్రారంభమైంది' అనే లైన్ ఆకర్షించింది. అయితే, ఆ ట్యాగ్‌లైన్ షారుక్ ఫ్యాన్స్‌నూ ఆందోళనకు గురి చేస్తోంది.
'డాన్-3'లో రణ్‌వీర్ సింగ్?
ఈ కొత్త శకం అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ డాన్‌గా తిరిగి రాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే 0కొత్త డాన్‌గా రణ్‌వీర్ సింగ్ వస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు షారుక్ లేకుండా డాన్ ఏంటని ఓ అభిమాని కామెంట్ చేశారు. డాన్ ప్రాతలో షారుక్ ఖాన్ లాగా నటించే మరో నటుడు లేడని మరో అభిమాని కామెంట్ చేశారు. షారుక్ లేకుండా డాన్ 3 లేదు అని ఇంకొకరు అన్నారు. షారుక్ లేకుండా కొత్త శకం అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు.
నిజానికి 1978లో అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సూపర్ డూపర్ హిట్ అయింది. అదే పేరుతో షారుక్ డాన్ తీసినా.. అది అధికారిక రీమేక్ కాదు. డాన్-3 అయినా అలా రిమేక్ అయితే బాగుంటుందని మరో అభిమాని కామెంట్ చేశారు. ఈ డాన్-3 మూవీని కూడా ఫర్హాన్ అక్తర్ నిర్మించి, డైరెక్ట్ చేయనున్నారని సమాచారం. 'డాన్-2' మూవీని అతడే డైరెక్ట్ చేశారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఫ్రాంఛైజీలోని సినిమాతో రాబోతున్నారు. 'డాన్' 2006లో, 'డాన్-2' 2011లో వచ్చాయి. ఈ సినిమాల్లో షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా నటించారు.
'అల్లు అర్జున్ సినిమాలు చూసి జవాన్‌లో నటించా'
Salaar VS Jawaan : సెప్టెంబర్‌పైనే ఆశలు.. అన్ని కలిసొస్తే రూ.2వేల కోట్లు పక్కా!